Nuvvu Nenu Collections: ‘నువ్వు నేను’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

ఉదయ్ కిరణ్ హీరోగా అనిత హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు నేను’. సునీల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై పి.కిరణ్ నిర్మించాడు. ఎటువంటి అంచనాలు లేకుండా 2001వ సంవత్సరం ఆగష్ట్ 10న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దర్శకుడు తేజ చాలా లో బడ్జెట్ లో తీసిన సినిమాలు అప్పట్లో భారీ వసూళ్లు సాధించేవి. ‘చిత్రం’ తర్వాత ఉదయ్ కిరణ్- తేజ కాంబినేషన్లో వచ్చిన ‘నువ్వు నేను’ కూడా భారీగా కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేటితో ఈ చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తికావస్తోంది.

మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :

నైజాం 4.63 cr
సీడెడ్ 1.55 cr
ఉత్తరాంధ్ర 1.62 cr
ఈస్ట్ 1.11 cr
వెస్ట్ 0.89 cr
గుంటూరు 0.93 cr
కృష్ణా 0.84 cr
నెల్లూరు 0.52 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్  3.44 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 15.33 cr

 

‘నువ్వు నేను’ చిత్రానికి కేవలం రూ.3.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం భారీగా రూ.15.33 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకు రూ.12 కోట్ల లాభాలు దక్కాయన్న మాట. అప్పట్లో స్టార్ డైరెక్టర్ల సినిమాలకే ఇంత కలెక్షన్లు రావడం కష్టంగా ఉండేది. కానీ దర్శకుడు తేజ లో- బడ్జెట్ లో తెరకెక్కించిన సినిమాలతోనే భారీ లాభాలను అందించే వాడు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus