నవ్విస్తూ, భయపెట్టిన OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్

  • June 15, 2024 / 10:55 PM IST

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్). మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది

‘ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు.. ఆ అమ్మాయే దెయ్యంగా మారి అందరినీ చంపేస్తోందని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘అందరి సమస్యలు వేరే అయినా వాటికి పరిష్కారం మాత్రం డబ్బు’.. అని ఓ గ్యాంగ్ పిశాచీపురంలోకి ఎంటర్ అవ్వడంతో ట్రైలర్‌లో ఫన్ ఎలిమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ‘ఇప్పటి వరకు ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు.. ఇప్పుడు వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం..’ అంటూ అసలైన హారర్ బొమ్మని చూపించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంతలా నవ్విస్తారో.. అంతలా భయపెట్టించేలా ఉన్నారు.

ట్రైలర్ చూసిన తరువాత అందరికీ ఓ విషయం అర్థం అవుతుంది. ఈ సినిమాలో కామెడీ, సూపర్ నేచురల్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ ఉన్నాయని తెలుస్తుంది. ట్రైలర్ నవ్వించడమే కాదు భయపెట్టేసేలా ఉంది. నందితా శ్వేత దెయ్యం పాత్రలో భయపెడుతుంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు వంటి వారు నవ్వించేశారు.

అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ అస్సెట్‌ కానుంది. ఈ సినిమా జూన్ 21న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus