Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్ సినిమానే టాప్.. కలక్షన్స్ ఎంతంటే?
- June 24, 2026 / 01:11 AM ISTByFilmy Focus Desk
మన దేశంలో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమా అంటే ‘దంగల్’ అని చెప్పేయొచ్చు. మొన్నీమధ్య ఆ రికార్డును బద్దలుకొట్టడానికి ‘ధురంధర్ 2’ వచ్చినా ఆ ఫీట్ సాధించలేకపోయింది. అయితే, ఇప్పుడు చర్చ ఆ సినిమాల కోసం కాదు. మన దేశంలో విడుదలైన హాలీవుడ్ సినిమా గురించి. ఆ సినిమా ఇప్పటివరకు మన బాక్సాఫీసు దగ్గర సుమార రూ.91 కోట్లు వసూలు చేసింది. ఇదేముంది పెద్ద వసూళ్లా అనుకోవద్దు. ఎందుకంటే ఓ హాలీవుడ్ సినిమాకు ఇవే మన దేశంలో అత్యధిక వసూళ్లు.
Obsession
ఆ సినిమా ‘అబ్సెషన్’. నటీనటులు ఎవరో తెలియదు.. దర్శకుడూ పెద్దగా పరిచయం లేదు.. కానీ ఇప్పుడు రికార్డు వసూళ్లు అందుకుందీ సినిమా. 2026లో భారత్‌లో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘అబ్సెషన్’ నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 332 మిలియన్ డాలర్ల వసూళ్లు అందుకుంది. ఇక ఈ సినిమా కథ గురించి చూస్తే.. బారోన్ అలియాస్ బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) మ్యూజిక్ స్టోర్‌లో ఉద్యోగి. నిక్కీ ఫ్రీమెన్ (ఇండీ నవరెట్టే) అంటే ఆయనకు ఎంత ఇష్టం.
అయితే, తన ప్రేమ గురించి చెబితే అంగీకరిస్తుందో, లేదోనని భయంతో చెప్పకుండా ఉండిపోతాడు. అంతేకాదు ఆమే తనను ప్రేమిస్తే బాగుంటుందని ఆశపడతాడు. దీని కోసం కోర్కెలు నెరవేర్చే ఓ వింత స్టిక్ కొంటాడు. ఆ కర్రను విరగ్గొట్టి మనసులో ఏదైనా అనుకుంటే అది నెరవేరుతుందని చెబతారు. ఈ మాయా స్టిక్‌ను విరగ్గొట్టి ‘నన్ను నిక్కీ ప్రేమించాలి’ అని కోరుకుంటాడు. దాని ప్రభావంతో బేర్‌ను నిక్కీ ప్రేమిస్తుంది. మొదట్లో బాగున్నా, రోజులు గడిచే కొద్దీ నిక్కీ ప్రేమ హద్దులు దాటుతుంది.
అతన్ని ఎక్కడికీ వెళ్లనివ్వదు, స్నేహితులను కూడా కలవనివ్వదు, వేరే అమ్మాయిలను కనీసం చూడనివ్వదు. చివరకు ఆ ప్రేమ ఏమైంది అనేదే సినిమా. సమాజంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతుండటంతో విదేశాల్లోనే కాదు, మన దేశంలోనూ సినిమాను ఆదరిస్తున్నారు.











