ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) సినిమాకు సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2) వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 17న రిలీజ్ అయిన ఈ సినిమాలో తమన్నా (Tamannaah Bhatia) శివశక్తిగా నటించాడు. అశోక్ తేజ (Ashok Teja) దర్శకుడు. స్టార్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) ఓ నిర్మాతగా అలాగే దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఫస్ట్ పార్ట్ థ్రిల్లర్ గా రూపొందింది. అయితే సెకండ్ పార్ట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తీర్చిద్దారు.సమాధి శిక్ష, పంచాక్షరి మంత్రం,ఓదెల మల్లన్న దర్శనం వంటి హైలెట్స్ సినిమాలో ఉన్నాయి.
కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. వీక్ డేస్ లో అయితే మరింతగా డ్రాప్ అయ్యింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.96 cr |
సీడెడ్ | 0.37 cr |
ఆంధ్ర | 0.98 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.31 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.16 cr |
హిందీ | 0.08 cr |
ఓవర్సీస్ | 0.22 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 2.77 cr (షేర్) |
‘ఓదెల 2’ (Odela 2) చిత్రానికి రూ.9.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.77 కోట్లు షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా రూ.4.70 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.