OG Collections: దసరా హాలిడేస్ తర్వాత స్లీపేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఓజి’ (OG) సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోలతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకున్నాడు. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా ‘ఓజి’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది.

OG Collections

తర్వాత డౌన్ అయినప్పటికీ మళ్ళీ దసరా హాలిడేస్ ను బాగా వాడుకుని క్యాష్ చేసుకుంది. ఓవర్సీస్, ఈస్ట్ గోదావరి వంటి ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.మిగతా ఏరియాల్లో కొంచెం వెనుకబడి ఉంది. జీఎస్టీ వంటివి మినహాయిస్తే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఒకసారి ‘ఓజి’ 2 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 42.64 cr
సీడెడ్ 18.85 cr
ఉత్తరాంధ్ర 13.54 cr
ఈస్ట్ 11.04 cr
వెస్ట్ 8.17 cr
గుంటూరు 9.48 cr
కృష్ణా 8.71 cr
నెల్లూరు 4.08 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 116.51 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 14.95 cr
ఓవర్సీస్ 32.14 cr
టోటల్ వరల్డ్ వైడ్ 163.6 (షేర్)

‘ఓజి’ (OG) చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.163.6 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.280 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. దసరా హాలిడేస్ వల్ల ‘ఓజి’ కి బాగానే కలిసొచ్చింది కానీ.. ‘కాంతార చాప్టర్ 1’ రేసులో ఉండటం వల్ల.. భారీగా క్యాష్ చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకుంది.

ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus