‘ఓజి’ సినిమా ఇటీవల అంటే సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యింది. దీనికి రిలీజ్ కి ముందు నుండి భారీ హైప్ ఉంది. అందుకే ప్రీమియర్స్ వేశారు. వాటికి మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కచ్చితంగా భారీగా వస్తాయి అనుకున్నారు. అది కూడా రికార్డు ఓపెనింగ్స్ ఖాయం అనుకున్నారు. ‘పుష్ప 2’ సినిమా ఓపెనింగ్స్ తో సరిసమానంగా ‘ఓజి’ కి ఓపెనింగ్స్ వస్తాయని అంతా ఆశించారు. కానీ రికార్డు ఓపెనింగ్స్ ఏమీ రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.
దీంతో వీకెండ్ కచ్చితంగా భారీ కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. 2వ రోజు నుండి కలెక్షన్స్ డౌన్ అవుతూ వచ్చాయి. అది ఎందుకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఓజి’ కి టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. అవి సామాన్యుల స్తోమతకి మించి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. కింద సెంటర్లలో జనాలు చూస్తేనే భారీ వసూళ్లు వస్తాయి. అలాంటప్పుడు ఎక్కువ టికెట్ రేట్లు ఉంటే.. జనాలు థియేటర్లకు ఎలా వస్తారు.
అందుకే సినిమా ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించలేదు. కానీ మేకర్స్ మాత్రం ఫేక్ కలెక్షన్ల పోస్టర్స్ వేసుకుని ‘ఓ జి’ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయిన ‘సంక్రాంతి వస్తున్నాం’ కలెక్షన్స్ ను దాటేసింది అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ‘కలెక్షన్స్ గురించి నేను పట్టించుకోను.. సినిమాని బ్రతకనివ్వండి.. ఫ్యాన్ వార్స్ ఆపేయండి’ అంటూ పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సక్సెస్ మీట్లో తెలియజేశారు. కానీ నిర్మాతలు మాత్రం ‘ఓజి’ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్ వార్స్ కి కారణం అవుతున్నారు.