హల్‌చల్ చేస్తున్న ‘ఒక మనసు’డైలాగ్స్!!!

టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోయిన్ నిహారిక ‘ఒక మనసు’ సినిమా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విడుదల అయ్యింది. నాగశౌర్య తో కలసి నిహారిక చేసిన ప్రేమ ప్రయాణం కధ పరంగా ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించినా, అటు నాగ శౌర్యకు, ఇటు నిహారికకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే సినిమా పరంగా అనుకున్నంత హిట్ టాక్ రానప్పటికీ ఈ సినిమాలో పేలిన కొన్ని ప్రేమ డైలాగ్స్ బయట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రముఖ రచయిత రామరాజు రాసిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి…మరి అలా ఆకట్టుకుంటున్న డైలాగ్స్ ను మనం కూడా చూద్దాం రండి….

1. రాజులు పోతారు, రాజ్యాలు పోతాయి, శరీరాలు కాలిపోతాయి, క‌ట్ట‌డాలు కూలిపోతాయి. కానీ మ‌న‌సులో రాసుకున్న క‌థ‌లు శాశ్వ‌తంగా ఉండిపోతాయి..

2. నీ మీద ప్రేమ చావ‌దు, మ‌రొక‌రి మీద ప్రేమా పుట్ట‌దు.. ప్రేమ ఒకరి మీదే పుడుతుంది.. అంతే కాదు అలా మనసులో పుట్టిన నిజమైన ప్రేమ ఎప్పటికి చావదు అనేది డైలాగ్.

3. రాజ‌కీయ నాయ‌కులంటే రాక్ష‌స జాతేమీ కాదు, ప్రతీ ఇంట్లోనూ రాజ‌కీయం ఉంటుంది, ర‌క్త సంబంధంలోనూ కుట్ర‌లు, కుతంత్రాలు, మోసాలు జ‌రుగుతున్నాయి. అవే రాజ‌కీయాలంటే..

4. ఎన్నో రంగుల‌ను లోప‌లే దాచుకుని, తెల్ల‌రంగును చూపించేవాడే రాజ‌కీయ‌నాయ‌కుడంటే.

ఇలా ఎన్నో డైలాగ్స్ ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి… సినిమా ఎంజాయ్ చేద్దామనుకుని వెళ్లే వారికి కాస్త నిరాశ కలిగినా… మనసుతో చూసే వారికి ఇదో దృశ్య కావ్యం అవుతుంది అని మాత్రం చెప్పవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus