Viswambhara: అవుట్‌డేటడ్‌ హీరోయిన్లను తీసుకొస్తున్నారేంటి? చిరు ప్లాన్‌ ఏంటో?

అగ్ర స్టార్‌ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టమే.. ఈ మాట ఇప్పటిది కాదు. గత కొన్నేళ్లుగా ఇదే మాట మనం వింటున్నాం. మన దగ్గర ఉన్న నలుగురు అగ్ర స్టార్‌ హీరోల కొత్త సినిమాలు మొదలైనప్పుడల్లా ఈ మాట వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ టాపిక్‌ డిస్కషన్‌లో ఉంది. ఈసారి కారణం మెగాస్టార్‌ చిరంజీవి. ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌ను పూర్తి స్థాయిలో పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది.

ఈ క్రమంలో చర్చలోకి వస్తున్న పేర్లు, ఇప్పటికే ఎంపికైన హీరోయిన్‌ను చూశాక అభిమానులకు అనిపిస్తున్న ఒకే ఒక మాట. ‘మరచిపోయినోళ్లను మళ్లీ తీసుకొస్తున్నారు ఏంటి?’. కావాలంటే మీరే చూడండి. ఈ సినిమాలో తొలి హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. ఈ మేరకు ఇప్పటికే అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. అయితే ఈ సినిమాలో ఆమెతోపాటు మరింకొంతమంది హీరోయిన్లు కూడా ఉంటారు అని సమాచారం. దీని కోసం కథానాయికల ఎంపిక కొనసాగుతోంది.

ఈ క్రమంలో మరో ఇద్దరు పేర్లు బయటికొచ్చాయి. వాళ్లే ఇషా చావ్లా, సురభి. ఈ పేర్లు ఎక్కడో విన్నట్లుగా ఉన్నాయి కదా. ఇషా చావ్లా అంటే ఆది సాయి కుమార్‌ ‘ప్రేమ కావాలి’తో ఇండస్ట్రీలోకి వచ్చి ఐదు సినిమాలు చేసినామె. పదేళ్లుగా తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఆ మాటకొస్తే ఇంకెక్కడా లేవు. ఇక సురభి అంటే యూవీ క్రియేషన్స్‌ వాళ్ల ‘రన్‌ రాజా రన్‌’తో హిట్‌ కొట్టిన అందం. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా సరైన విజయం రాలేదు.

ఈ ఇద్దరిని సినిమాలోకి తీసుకోవడమే కాదు ఇప్పటికే కొన్ని సన్నివేశాలు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అంతేకాదు మరికొందరు కథానాయికలూ కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ మొదలవుతుంది. అప్పుడు వాళ్లు కూడా వస్తారు అంటున్నారు. అయితే వాళ్లు కూడా పాత నాయికలు, పెద్దగా విజయాలు లేని నాయికలే అంటున్నారు. దీంతో పాత వాళ్లందరూ ఎందుకు అనే ప్రశ్న వస్తోంది. అయితే చిన్న చిన్న పాత్రకు పెద్ద నాయికలు, కొత్తమ్మాయిల్ని తీసుకోరు కదా అనే మాట కూడా వినిపిస్తోంది.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus