Prabhas: ఆ హీరోనే బిగ్గెస్ట్ స్టార్ అంటున్న ఓం రౌత్!

  • April 14, 2022 / 01:42 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో ఓం రౌత్ ఒకరనే సంగతి తెలిసిందే. ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. రాముడి పాత్రలో ప్రభాస్ ఏ విధంగా ఉంటారో తెలుసుకోవడానికి ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఓం రౌత్ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.

Click Here To Watch NOW

ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అని ఓం రౌత్ చెప్పుకొచ్చారు. దేశంలోని దర్శకులంతా ప్రభాస్ హీరోగా సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్నారని ఓం రౌత్ అన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభాస్ సినిమా కొరకు కష్టపడతాడని ఆయన కామెంట్లు చేశారు. ప్రభాస్ లోని ప్రతిభను దర్శకులు వినియోగించుకోవాలని ఆయన వెల్లడించారు. దేశంలో బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదని ఆయన అన్నారు.

ప్రభాస్ ప్రవర్తన ఇతర హీరోలతో పోల్చి చూస్తే భిన్నమని దర్శకులను గౌరవించే హీరోలలో ప్రభాస్ ఒకరని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్ మనసులోని భావాలు కళ్లలో కనిపిస్తాయని ఓం రౌత్ కామెంట్లు చేశారు. ప్రభాస్ కళ్లతో అద్భుతంగా హావభావాలు పలికిస్తారని ఆదిపురుష్ లో కొత్త ప్రభాస్ ను చూడబోతున్నామని ఓం రౌత్ పేర్కొన్నారు. 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఓం రౌత్ ఈ సినిమాతో ప్రభాస్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ ఫలితాలు నిరాశకు గురి చేసిన నేపథ్యంలో తర్వాత సినిమాలతో సక్సెస్ ను అందుకోవాలని ప్రభాస్ అనుకుంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఇతర సినిమాలతో పోల్చి చూస్తే సలార్ సినిమాపై ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus