Jr NTR: ‘ ఆర్.ఆర్.ఆర్’ నుండీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ న్యూస్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రాంచరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య ప్రెస్టీజియస్ ఎంతో ప్రెస్టీజియస్ గా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ పాన్ వరల్డ్ మూవీని నిర్మించాడు.ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోస్, రెండు పాటలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

దాంతో సినిమా పై ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయనే చెప్పాలి. ఇక సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లను ఫుల్ స్వింగ్ లో నిర్వహించాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నాడు. ఇదిలా ఉండగా… ‘ఆర్.ఆర్.ఆర్’ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే… ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఓ పాటని ఎన్టీఆర్ పాడబోతున్నాడట. ఎన్టీఆర్లో మంచి సింగర్ ఉన్నాడని ‘యమదొంగ’, ‘కంత్రీ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకుప్రేమతో’ వంటి చిత్రాలతో ప్రూవ్ అయ్యింది.

పునీత్ రాజ్ కుమార్ ‘చక్రవ్యూహా’(కన్నడ) చిత్రంతో అయితే ఆ విషయం బోర్డర్ కూడా దాటింది. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ తో ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ కానుందన్న మాట. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ ఇటీవల విడుదలైన ‘నాటు నాటు’ పాట పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus