అఖిల్ ఈసారి బాగా రిస్క్ చేస్తున్నాడా?

అక్కినేని మూడో తరం హీరో అయిన అఖిల్.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి 5 ఏళ్ళు కావస్తున్నా.. ఇంకా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. వినాయక్ డైరెక్షన్లో ‘అఖిల్’ అనే చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది కానీ విజయవంతం కాలేకపోయింది. రెండో సినిమా ‘హలో’ని… ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చేసాడు. ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది కానీ కమర్షియల్ గా అంత వర్కౌట్ కాలేదు. ఇక మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’ ని ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో చేసాడు. ఆ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు.

అప్పటి వరకూ అఖిల్ చేసిన సినిమాలు అన్నీ హిట్ డైరెక్టర్లతోనే.. . అయినప్పటికీ హిట్ దక్కలేదు. అయితే ఇప్పుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ వంటి ఫ్లాప్ డైరెక్టర్ తో తన 4 వ చిత్రాన్ని చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ గత చిత్రం ‘ఒంగోలు గిత్త’ పెద్ద ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ తన 4వ చిత్రాన్ని భాస్కర్ డైరెక్షన్లో చెయ్యడానికి ఓకే చెప్పాడు అఖిల్. ‘గీత ఆర్ట్స్’ నిర్మాణం కాబట్టి.. అందులో పెద్ద రిస్క్ లేదు. హిట్టు గ్యారెంటీ అనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మరో ఫ్లాప్ డైరెక్టర్ కు కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.

‘బిందాస్’ ‘రగడ’ ‘దూసుకెళ్తా’ ‘ఈడు గోల్డ్ ఎహె’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వీరు పోట్ల.. ఇటీవల అఖిల్ ను కలిసి ఒక లైన్ చెప్పాడట. ఈ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని తీసుకురమ్మని వీరుతో.. అఖిల్ చెప్పాడట. అయితే ఫుల్ స్క్రిప్ట్ అఖిల్ కు నచ్చాలి.. తరువాత నాగార్జునకు నచ్చి ఓకే చేస్తే ఈ ప్రాజెక్టు సెట్ అవుతుంది. లేకపోతే లేదు.! ఫ్లాప్ డైరెక్టర్ కు తన కొడుకుని అప్పగించి నాగార్జున కూడా రిస్క్ చేసే పరిస్థితిలో లేడు లెండి..!

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus