అనుష్క ఎందుకు మళ్ళీ రిస్క్ చేస్తుంది..?

  • June 18, 2020 / 10:04 AM IST

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోయిన్లు ఇద్దరే.. ఇద్దరు.! ఒకరు నయన తార.. రెండు అనుష్క. అయితే నయన తార వరుస సినిమాల్లో నటిస్తూ భారీగా పారితోషికం అందుకుంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది.కానీ మన అనుష్కకు ఆ స్థాయిలో క్రేజ్ ఉన్నా సరే.. క్యాష్ చేసుకోలేకపోతుంది. అది పక్కన పెడితే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినా.. ఫ్లాప్ డైరెక్టర్లతోనే సినిమాలు చెయ్యడానికి ఓకే చెబుతుంది.

రెండేళ్ళ క్రితం వచ్చిన అనుష్క చిత్రం ‘భాగమతి’ ని గమనిస్తే ఆ చిత్రం దర్శకుడు జి.అశోక్ కు ఒక్క ‘పిల్ల జమిందార్’ తప్ప.. ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ లే..! ఇక ఇప్పుడు ‘నిశ్శబ్దం’ అనే చిత్రం చేసింది అనుష్క. లాక్ డౌన్ లేకపోతే.. ఈపాటికే ఈ చిత్రం విడుదలయ్యి ఉండేది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు హేమంత్ మధుకర్..2011లో మంచు విష్ణు,తాప్సి లతో ‘వస్తాడు నారాజు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అది కూడా ఫ్లాపే.

ఇక తరువాతి చిత్రాన్ని సందీప్ కిషన్ కు ‘రా రా కృష్ణయ్య’ వంటి ఫ్లాప్ సినిమాని అందించిన దర్శకుడు మహేష్ తో చేస్తుంది. అనుష్క కు స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నప్పటికీ.. ఎక్కువ పారితోషికం ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఫ్లాప్ దర్శకులతోనే సినిమాలు చేస్తూ వస్తుండడం ఆమె అభిమానులను ఒకింత కంగారు పెట్టే విషయమని చెప్పాలి. అసలు అనుష్క తన క్రేజ్ ను ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతుంది అనేది అంతు చిక్కని ప్రశ్న అనే చెప్పాలి.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus