కమెడియన్, నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్.. గతేడాది రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చి సినిమాలకి దూరమయ్యాడు. అటు తరువాత రాజకీయాలు ‘నాకు సెట్టవ్వట్లేదు అంటూ’ బయటకి వచ్చేసాడు. దీంతో తిరిగి సినిమాల్లో నటిస్తాడని చాలా రోజుల నుండీ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అది నిజమేనని తాజా సమాచారం. 2012 లో మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘బిజినెస్ మేన్’ చిత్రంలో నటించాడు బండ్ల గణేష్. నటుడిగా ఆయన కనిపించిన గత చిత్రం అదే. మళ్ళీ 7 ఏళ్ళ గ్యాప్ తర్వాత మహేష్ చిత్రంతోనే తిరిగి నటుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు.
అవును ముందు వచ్చిన సమాచారం మేరకు… మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోనే బండ్ల గణేష్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మంచి కామెడీ తో బండ్ల అలరిస్తాడని చెబుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇక అతి త్వరలో బండ్ల గణేష్ షూటింగ్లో జాయిన్ అవుతున్నాడట. మరో విశేషం ఏమిటంటే ‘బిజినెస్ మేన్’ 2012 సంక్రాంతికి విడుదలయ్యింది.. అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కూడా 2019 అదీ సంక్రాంతికే విడుదల కాబోతుంది.