Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..
- October 27, 2026 / 10:21 PM ISTByFilmy Focus Desk
సినిమాల విషయంలో రాజమౌళి ఓ ఫార్ములానే చాలా ఏళ్లుగా ఫాలో అవుతున్నారు. తన సినిమా ప్రారంభించిన కొన్ని రోజులకే ఓ ప్రెస్ మీట్ పెట్టి సినిమా నేపథ్యం, స్టోరీ లైన్ చెప్పేస్తూ ఉంటారు. ఆయన పాన్ ఇండియా సినిమాలన్నింటికీ ఇదే పని చేస్తూ వచ్చారు. అయితే ‘వారణాసి’ సినిమా విషయంలో మాత్రం ఆయన దీన్ని ఫాలో అవ్వలేదు. ఇప్పటివరకు సినిమా స్టోరీ లైన్‌ని చెప్పలేదు. అయితే ఓ వీడియో రిలీజ్ చేసి.. దాని ద్వారా కథను నెరేట్ చేసే ప్రయత్నం చేశారు.
Rajamouli
దీని గురించి రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈసారి నాకు కథ చెప్పాలని అనిపించలేదు. ఈ సినిమా ఎంత పెద్దది అనే విషయాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సినిమా కథ పరిథి విస్తృతమైనది. అందుకే వారణాసి ప్రపంచం ఎలా ఉండబోతోందో ఒక చిన్న గ్లింప్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశా. మాటల్లో చెప్పడం కంటే, ప్రేక్షకులకు వారణాసి ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాం అని క్లారిటీ ఇచ్చారు.

నిజానికి ఆ గ్లింప్స్ వీడియోలో కాలక్రమంలో ‘వారణాసి’ సినిమా కథను రాజమౌళి చెప్పారు. ఆ తర్వాత సినిమా గురించి వచ్చిన సమాచారంతో కలిపి మొత్తంగా మాట్లాడుకుంటే.. తండ్రి కోసం వివిధ కాలాల్లో, వివిధ ప్రపంచాల్లోకి హీరో వెళ్తాడు. అలా విభిన్న ప్రపంచాల ద్వారా సాగే సాహస యాత్ర ఈ సినిమా. అంటార్కిటికా, ఆఫ్రికాతో పాటు వారణాసి నగరాన్ని వివిధ కాలమానాల్లో చూపిస్తారు. ఈ క్రమంలో సినిమా పౌరాణిక కాలంలోకి కూడా వెళ్తుంది.
ఆయా కాలమానాల్లో అక్కడి ప్రజలు, పరిస్థితులను చూపిస్తారు. ఇక ఇతర ప్రపంచాల్లోకి వెళ్లినప్పుడు రాక్షసులు, దేవుళ్ళను కూడా చూపిస్తారు. అలాగే పిల్లలకు నచ్చే వింతలు, విశేషాలు కూడా ఉంటాయి. ఈ అంతటి అడ్వెంచర్‌కు మూలంగా తండ్రీకొడుకుల అనుబంధం నిలుస్తుంది. దాంతోపాటు ఈ సినిమాలో ఓ మంచి ప్రేమకథ కూడా ఉంది. ఈ సినిమాలో మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపిస్తాడు. మందాకినిగా ప్రియాంక చోపడా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడు.












