Chiranjeevi, Ram Charan: ఫ్రాంచైజీ సినిమాలో తండ్రీకొడుకులు పక్కా అంటున్నారు!

Advertisement

చిరంజీవి, చరణ్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే అభిమానులకు వచ్చే కిక్కే వేరు. అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా ఇద్దరూ కలసి నటిస్తుంటారు. త్వరలో ‘ఆచార్య’తో మరోసారి అలా కనిపించబోతున్నాడు. అయితే ఈ కాంబో మరోసారి కూడా వెండితెరపై సందడి చేయబోతోందని టాక్‌. అందుకు తగ్గట్టుగా ఓ కథ కూడా సిద్ధమైందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ కాంబో ఒక సినిమాలో కాదు ఏకంగా సిరీస్‌లో కనిపిస్తుందని టాక్‌. సిరీస్‌ అంటే మీకు అర్థమైపోయుంటుంది. ఆ సినిమా ఎవరిదో.

అవును… మీరు అనుకుంటున్నది నిజమే. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఓ సినిమా సిరీస్‌లో నటిస్తాడని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రశాంత్‌ వచ్చి… చిరంజీవి, చరణ్‌ను కలసి కథ వినిపించాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ సినిమా ఉంటుంది అని కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి. తొలుత ఈ సినిమా చరణ్‌తోనే అనుకున్నారు. అయితే తాజాగా వస్తున్న పుకార్ల ప్రకారం ఇది మల్టీస్టారర్‌ అట. డాన్‌లు, రాజ్యాలు నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది.

ఇందులో హీరో పాత్రతోపాటు మరో పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. దానికి చిరంజీవి అయితే బాగుంటుందని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నారట. అందుకే చిరంజీవి – చరణ్‌ ఉన్నప్పుడే కథ పాయింట్‌ చెప్పి ఓకే చేసుకున్నారట. త్వరలో దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగి సినిమా లాక్‌ చేసుకోవాలన చూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్‌ ‘సలార్‌’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ సినిమా చేస్తాడట. ఈ లోపు చరణ్‌ శంకర్‌ సినిమా పూర్తి చేసుకొని వీలైతే గౌతమ్‌ తిన్ననూరి సినిమా కూడా చేసేస్తాడని అంటున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus