Chiranjeevi: చిరంజీవి మరోసారి ఆలోచించాల్సిందేనా? రీమేక్‌లపై ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌!

టాలీవుడ్‌లో రీమేక్‌ సినిమాలు ఫలానా హీరోనే చేయాలని లేదు కానీ.. అందరికీ వర్కవుట్‌ అవ్వవు అంటుంటారు. ఇటీవల కాలంలో అయితే చిరంజీవికి వర్కవుట్‌ కాలేదు. దీంతో చిరంజీవి రీమేక్‌లకు దూరంగా ఉంటే మంచిది అనే మాట వినిపించింది. అలా అని చిరంజీవికి రీమేక్‌లు పూర్తిగా వర్కవుట్‌ కావా? అంటే ఇండస్ట్రీలో రీమేక్‌లతో ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌లు సాధించాడు మెగాస్టార్‌. అయితే ఇప్పుడెందుకు ఫ్యాన్స్‌ వద్దంటున్నారు? సోషల్‌ మీడియాలో నడుస్తున్న ఈ చర్చపై ఓ లుక్కేద్దాం!

చిరంజీవి కెరీర్‌లో చూడని జయాపజయాలు లేవు. ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చాడు.. అలాగే దారుణమైన ఫ్లాప్‌లు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు చిరంజీవి ఉన్న ఫేజ్‌ మరో రకం. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి క్రేజ్‌ మారిపోయింది. సరైన మాస్‌ సినిమా పడితే చిరు.. ఇప్పటికీ కుర్ర హీరోలా దూసుకుపోతారు అని తేలిపోయింది. ఇప్పుడు చిరు రీమేక్‌లు చేయొద్దు అని ఫ్యాన్స్‌ అనడానికి కూడా ఇదే కారణం. సరైన కథలు, దర్శకులు మన దగ్గర ఉన్నప్పుడు ఈ రీ‘మేకు’లు మనకు ఎందుకు అంటున్నారు ఫ్యాన్స్‌.

చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘భోళా శంకర్‌’… తమిళ సినిమా ‘వేదాళం’కు రీమేక్‌. ఈ సినిమా మీద పెద్దగా బజ్‌ లేదు. దీనికి కారణం పాత రీమేక్‌ అనేది తొలుతది అయితే, రెండోది దర్శకుడు మెహర్‌ రమేశ్‌ మీద నమ్మకం లేకపోవడం. ఆయన స్టార్‌లను హ్యాండిల్‌ చేయలేరు అని మెగా అభిమానులు గట్టిగా నమ్మేసున్నారు. ఈ సినిమా అలా వదిలేసి.. తర్వాతి సినిమా గురించి చూద్దాం అంటే.. ఆ సినిమా కూడా రీమేకే అంటున్నారు.

దీంతోనే సమస్య వచ్చి పడింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘బ్రో డాడీ’ సినిమా రీమేక్‌ హక్కులు చాలా రోజుల క్రితమే రామ్‌చరణ్‌ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఆ కథను స్ఫూర్తిగా తీసుకొని కల్యాణ్‌ కృష్ణ కురసాల చిరంజీవితో సినిమా చేస్తారట. ఈ సినిమాకు చిరు తనయ సుస్మిత నిర్మాత అవుతారు.

ఇందులో త్రిష కథానాయిక కాగా… సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల పెయిర్‌గా నటిస్తారని చెబుతున్నారు. దీంతో రీమేక్‌లు వద్దని చిరంజీవికి చెబుతున్నా.. వినడం లేదు అనే విమర్శ కనిపిస్తోంది. అన్నింటికి మించి ‘గాడ్‌ ఫాదర్‌’ ఫలితం చూశాక కూడా చిరు ఇలా చేయడమేంటి అంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus