ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో రాజశేఖర్ కొత్త సినిమా మొదలు..!

  • December 29, 2020 / 11:10 PM IST

కొత్త హీరోలు జోరు ఎక్కువైనప్పటి నుండీ సీనియర్ హీరోల సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. బాలకృష్ణ వంటి పెద్ద హీరో సినిమాలకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ట్యాలెంట్ ఉన్న కుర్ర డైరెక్టర్లు.. సీనియర్ హీరోలతో మంచి సినిమాలను తీస్తున్నారు. ఇదే కోవలో రాజశేఖర్ కూడా ప్రవీణ్ సత్తారు అనే యంగ్ డైరెక్టర్ తో ‘పి.ఎస్వీ. గరుడవేగా’ అనే చిత్రం చేసాడు. దాదాపు రాజశేఖర్ ను అందరూ మరిచిపోయారు అనుకున్న టైంలో..

ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యి.. అతని సినిమాల పై కూడా ఆసక్తి నెలకొనేలా చేసింది.అటు తరువాత ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ‘కల్కి’ అనే చిత్రం చేసాడు రాజశేఖర్. ఈ చిత్రానికి పాజిటివ్ టాకే వచ్చినప్పటికీ.. బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. కానీ రాజశేఖర్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇలా యంగ్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేసి..రాజశేఖర్ మళ్ళీ ఫామ్లోకి వస్తాడు అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ ప్లాప్ డైరెక్టర్లకే అవకాశాలు ఇస్తున్నాడని ఇన్సైడ్ టాక్.

సునీల్ తో ‘పూలరంగడు’ వంటి హిట్ మూవీ, అలాగే నాగార్జున తో ‘భాయ్’ వంటి ప్లాప్ మూవీ తీసి సైలెంట్ అయిపోయిన దర్శకుడు వీరభద్రం చౌదరితో ఇటీవల రాజశేఖర్ ఓ సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడట. షూటింగ్ కూడా ప్రారంభమయ్యిందని సమాచారం. అంతేకాదు మరో ఇద్దరు ఫేడౌట్ అయిపోయిన దర్శకులకు రాజశేఖర్ అవకాశాలు ఇస్తున్నాడని కూడా ఇన్సైడ్ టాక్. ఉన్నట్టుండి ఎందుకు రాజశేఖర్ ఇలా కంగారు పడుతున్నాడని గుసగుసలు ప్రస్తుతం ఊపందుకున్నాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus