రిజల్ట్ కంటే రిలేషన్ ఇంపార్టెంట్ అంటున్న సూర్య!

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి కాంబినేషన్స్ ఎలా, ఎందుకు, ఎప్పుడు వర్కవుట్ అవుతాయో ఎవ్వరికీ, ఎప్పటికీ అర్ధం కావు, అర్ధం చేసుకోలేరు కూడా. అలాంటి రేర్ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ రిపీటవ్వబోతోంది. “సింగం 2″తో సూర్యకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ హరితో సూర్య మరో సినిమా చేయనున్నాడు. సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో “ఎన్జీకే” చిత్రంతోపాటు కేవీ.ఆనంద్ తెరెకెక్కిస్తున్న తన 37వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలే కాక మ‌రో రెండు చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అందులో ఒక‌టి “గురు” ఫేమ్ సుంద కొంగరతో ఒక చిత్రం కాగా త‌న‌కు “సింగం” వంటి బ్లాక్ బ్లాస్టర్ చిత్రాన్ని ఇచ్చిన హరి దర్శకత్వంలో మరో చిత్రంలో న‌టించడానికి అంగీక‌రించాడు.

అయితే ఈ తాజా చిత్రం “సింగం” సీక్వెల్ గా రావడం లేదు. డిఫ‌రెంట్ స్టోరీ తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది. హరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఈ సినిమా కూడా ఉండబోతోందట. మరి “సామి” లాంటి డిజాస్టర్ అనంతరం సూర్య ఇచ్చిన అవకాశాన్ని హరి ఏమేరకు సద్వినియోగపరుచుకుంటాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus