Vijay Remuneration: విజయ్ మరో రూ.50 కోట్లు పెంచాడట!

  • January 31, 2023 / 12:31 PM IST

ఒక హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది అతడి సినిమా మార్కెట్ మీద, వసూళ్ల మీద ఆధారపడి ఉంటుంది. సినిమా ఏవరేజ్ గా ఉన్నా.. అది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడితే దాన్ని బట్టి హీరో ఇమేజ్ ను ఊహించుకోవచ్చు. దాని ప్రకారమే రెమ్యునరేషన్ కూడా ఇస్తారు. ఇప్పుడున్న హీరోలు వంద కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తమిళ హీరో విజయ్ ‘వరిసు’ సినిమాకి వంద కోట్ల పారితోషికం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

ఆ సినిమా ఒప్పుకునే సమయానికి విజయ్ రెమ్యునరేషన్ వంద కోట్లకు చేరిపోయింది. పైగా ఈ సినిమా విడుదలకు ముందే దిల్ రాజు భారీ ఎత్తున లాభాలను ఆర్జించారని సమాచారం. పైగా సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. థియేటర్ మీద వరల్డ్ వైడ్ గా వంద కోట్ల మేరకు వసూళ్లను సాధించింది. ఇలాంటి నేపథ్యంలో విజయ్ ఇప్పుడు తన రెమ్యునరేషన్ రూ.150 కోట్లు చేశారని సమాచారం. విజయ్ తన నెక్స్ట్ సినిమా లోకేష్ కనగరాజ్ తో చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం విజయ్ రూ.150 కోట్లు డిమాండ్ చేశారట. అయితే సినిమా నాన్ థియేట్రికల్, థియేట్రికల్ రైట్స్ తో లాభాలు వచ్చేస్తాయనే నమ్మకం నిర్మాతలకు ఉంది. అందుకే హీరో అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడని తెలిసింది. కథ ప్రకారం.. విజయ్ ఈ సినిమాలో మధ్య వయస్కులైన డాన్ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం.

ఆయనకి జోడిగా త్రిష కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు మిస్కిన్, గౌతమ్ మీనన్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ యూనివర్స్‌లో భాగం అయిన సూర్య, కార్తీ, కమల్ హాసన్‌లు కూడా విజయ్ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారని టాక్.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus