Love Story Movie: అయ్యో.. లవ్ స్టోరీకి ఇన్ని సమస్యలా?

  • August 28, 2021 / 09:15 AM IST

యంగ్ హీరో నాగచైతన్య టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా మరోసారి వాయిదా పడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా వేర్వేరు రీజన్స్ వల్ల నిర్మాతలు దాదాపుగా సినిమాను వాయిదా వేశారని సినిమా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉందని సమాచారం. లవ్ స్టోరీ వాయిదాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ఏపీలో టికెట్ రేట్లు పెరగాల్సి ఉన్నా టికెట్ రేట్లు ఎప్పటించి పెరుగుతాయో స్పష్టత లేదు. మరోవైపు ఏపీలో సెకండ్ షోలకు కూడా అనుమతులు లేవు. కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడినా ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపడం లేదు. ఈ రీజన్స్ వల్లే లవ్ స్టోరీ సినిమాను తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయనున్నారని సమాచారం. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ల పరిస్థితి ఆశాజనకంగా లేదు.

టాక్ మరీ బాగుంటే మాత్రమే థియేటర్లలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. లవ్ స్టోరీ వాయిదా పడగా అదే రోజున ఓటీటీలో టక్ జగదీష్ రిలీజ్ కానుంది. టక్ జగదీష్ తో ష్యూర్ షాట్ హిట్ సాధిస్తానని నాని భావిస్తుండగా నాని నమ్మకాన్ని టక్ జగదీష్ నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు సీటీమార్ సెప్టెంబర్ 3వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో డిస్కషన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus