బాలీవుడ్లో క్యాస్టింగ్ ఆరోపణలకు బ్రేక్ ఉండదు.. ఆ మాటకొస్తే ఏ ‘వుడ్’లో అయినా ఇంతే. మాజీ హీరోయిన్లు, ఐటెమ్ భామలు… ఇలా ఎవరో ఒకరు ఎప్పుడూ ఆరోపణలు చేస్తూ ఉంటారు. దానికి అవతలి వ్యక్తులు సమాధానం ఇస్తుంటారు. కొందరైతే మనల్ని అనలేదే అని వదిలేస్తుంటారు. గతంలో జరిగిన విషయాల్ని ఇప్పుడు చెబుతూ… కొంతమంది స్టార్ దర్శకుల్ని టార్గెట్ చేస్తుంటారు. తాజాగా అలా ఓ దర్శకుడి పేరు, హీరోయిన్ పేరు వార్తల్లోకి వచ్చాయి. ఆ దర్శకుడు సాజిద్ ఖాన్ కాగా., ఆ నాయిక షెర్లిన్ చోప్రా.
‘మీటూ’ ఉద్యమం వచ్చాక బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేదింపుల ఆరోపణలు చాలా వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ అలా అన్నాడు, ఈ డైరెక్టర్ నన్ను గదికి రమ్మన్నాడు అంటూ చాలామంది హీరోయిన్లు ఆరోపణలు చేశారు. అయితే బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా కాస్త ఘాటుగా కామెంట్స్ చేసింది. ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని… తన జననాంగాన్ని ముట్టుకోమన్నాడని ఆరోపించింది. 2005లో కలిసినప్పుడు తనతో అలా అసభ్యంగా ప్రవర్తించాడని షెర్లిన్ చెప్పుకొచ్చింది.
సాజిద్ అలా ప్రవర్తించేసరికి తనకు చాలా కోపం వచ్చిందని… ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదని చెప్పింది షెర్లిన్. అంతేకాకుండా బాలీవుడ్ లో మాఫియా చాలా బలంగా ఉందంటూ విమర్శించింది షెర్లిన్. సాజిద్ మీద ఇలా మీటూ ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో చాలామంది నాయికలు ఆరోపణలు చేశారు. షెర్లిన్ ఎనిమిదో నాయిక. అంతకుముందు జియా ఖాన్, మందనా కరిమి, ఆహన కుమ్రా, డింపుల్ పాల్, కరిష్మా ఉపాధ్యాయ, రేచల్ వైట్, సలోని చోప్రా.. ఇలా సాజిద్ మీద ఆరోపణలు చేశారు.