శర్వానంద్ మొన్నామధ్య వరుస ప్లాప్ లు ఎదుర్కొన్నాడు. ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఇలా శర్వా ఖాతాలో 6 ప్లాపులు పడ్డాయి. అయితే గతేడాది చివర్లో వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో శర్వానంద్ తన ప్లాపులకు బ్రేకులు వేసినట్లయింది. సో తన ఇమేజ్ కు సెట్ అయ్యే కథలు కాకుండా.. కోవిడ్ తర్వాత మారిన ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు కథలు ఎంపిక చేసుకోవాలని శర్వానంద్ కు అర్థమైంది.
అందుకే ఇప్పుడు హిట్టున్న దర్శకులతోనే సినిమాలు చేస్తాను అని పట్టుబట్టి కూర్చోకుండా.. హిట్ ఇవ్వాలి అనే తాపత్రయం ఉన్న దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. ఈ మధ్యనే తన 35వ సినిమాని అనౌన్స్ చేశాడు. ‘హీరో’ తో ప్లాప్ ను మూటగట్టుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా.. శర్వానంద్ ఇప్పుడు మరో ప్లాప్ డైరెక్టర్ తో పనిచేయడానికి రెడీ అయ్యాడు.
అతను మరెవరో కాదు కె.వి.గుహన్. ‘118’ తో దర్శకుడిగా మారిన ఇతను ఆ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. తర్వాత ‘WWW’ ‘హైవే’ వంటి సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.వీటి టాక్ ఏంటో కూడా చాలా మందికి తెలీదు.కానీ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఓటీటీ వల్ల ఈ ప్రాజెక్టులు సేఫ్ అయిపోయాయి అనుకోవచ్చు.
అలాంటి గుహన్ కి ఇప్పుడు శర్వానంద్ (Sharwanand) ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ కథ వినడం ఓకే చెప్పడం జరిగింది. ఇది థ్రిల్లర్ కథాంశంతో రూపొందనుందని సమాచారం. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.