Rhea Chakraborty: రియా చక్రవర్తిపై మరోసారి ట్రోలింగ్!

నటి రియా చక్రవర్తి బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో కూడా ఓ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ హీరోయిన్ గా ఆమె పాపులర్ కాలేకపోయింది. కానీ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ గా ఆమెకి గుర్తింపు ఉంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి పరోక్షంగా ఆమెనే కారణమంటూ అప్పట్లో పుకార్లు వినిపించాయి. సుశాంత్ తండ్రి కూడా ఆమెపై ఆరోపణలు చేశారు. ఆ తరువాత డ్రగ్ కేసులో ఇరుక్కుంది రియా చక్రవర్తి.

ఈ కేసులో ఆమె జైలుకి కూడా వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై దారుణమైన ట్రోలింగ్ నడిచింది. దీంతో కొన్నాళ్లపాటు సైలెంట్ అయిపోయింది రియా చక్రవర్తి. ఇప్పుడిప్పుడే మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టింది. ఈరోజు సుశాంత్ రాజ్ పుత్ జయంతి సందర్భంగా కొన్ని పాత ఫొటోలను రియా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కాఫీ మగ్స్ వెనుక దాక్కున్న ఫొటో ఒకటి, అలానే బెడ్ పై పడుకొని తీసుకున్న సెల్ఫీలను షేర్ చేసింది.

ఈ రెండు ఫొటోలపై నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇంకా సుశాంత్ ని వదిలిపెట్టవా..? అంటూ కొందరు రియాని ట్రోల్ చేస్తున్నారు. సింపతీ కోసం ఇదంతా చేస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘నువ్ ఎన్ని పోస్ట్ లు పెట్టినా.. చేసిన పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుందని’ ఆమెని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. తనపై ట్రోలింగ్ జరుగుతున్నా.. రియా మాత్రం ఆ ఫొటోలను డిలీట్ చేయలేదు.

రియాతో పాటు మరికొంతమంది బాలీవుడ్ తారలు సుశాంత్ రాజ్ పుత్ జయంతి సందర్భంగా అతడి ఫొటోలను షేర్ చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. హీరోయిన్ సారా అలీ ఖాన్ అయితే ఒక ఎన్జీవోకి వెళ్లి అక్కడ పిల్లలతో కేక్ కట్ చేయించి.. సుశాంత్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus