Taapsee: మరోసారి ఫోటోగ్రాఫర్లపై మండిపడిన తాప్సీ.. అలా చేయడంతో సీరియస్?

అందాల నటి తాప్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తాప్సీ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇలా తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అవకాశాలు అందుకొని అక్కడే సెటిల్ అయ్యింది. తాప్సీ తరచు అనేక విషయాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇటీవల తాప్సీ నటించిన దొబెరా ప్రమోషనల్లో పాల్గొన్న సమయంలో ఫోటోగ్రాఫర్లకు అమెకు మద్య వివాదం జరిగింది. దొబెరా ప్రమోషనల్లో పాల్గొన్న తాప్సీకి ఫోటోగ్రాఫర్లకు..మధ్య తీవ్రస్తాయిలో మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత కొంతసమయానికి ఇలా చేయటం వల్ల మీకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయా? అంటూ ఓ విలేకరి అడగ్గా.. అతడిపై తాప్సీ మండిపడింది. మీతో ఎలా ప్రవర్తించిన కూడా నటీనటుల గురించి నెగటివ్ రివ్యూలు ఇవ్వటం మీకు అలవాటు అంటూ మండిపడింది.

ప్రతి నటి, నటుడికి పాజిటివ్, నెగిటివ్ రివ్యూ ఉంటుందని తాప్సీ చెప్పుకొచ్చింది. ఆ సంఘటన మరువకముందే తాజాగా తాప్సీ మరొకసారి ఒక ఫొటోగ్రాఫర్ పై మండిపడింది. అసలు విషయం ఏమిటంటే..బుధవారం తాప్సీ కారులోకి ఎక్కి డోరు మూయటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఓ ఫోటోగ్రాఫర్ ఆమెను డోర్ మూయకుండా చేతితో డోర్ పట్టుకొని అడ్డుపడ్డాడు.

ఇలా ఫోటోగ్రాఫర్ అడ్డుపడటంతో తాప్సీ ఇంకోసారి అలా చేయోద్దు అంటూ అతనికి వార్నింగ్ ఇవ్వడంతో అతను డోర్ వదిలిపెట్టాడు. అనంతరం అక్కడి నుంచి తాప్సీ వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాప్సీ తీరుపై నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు. అయితే మరికొందరు ఈ విషయంపై స్పందిస్తూ తాప్సీకి మద్దతు తెలుపుతున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus