లాక్ డౌన్ సమయంలో సామాన్య ప్రజల నుండీ సెలబ్రిటీలు కూడా ఇళ్ళల్లోనే ఉంటూ వస్తున్నారు.ఇప్పుడు ఎలాగూ షూటింగ్ లు లేవు కాబట్టి చాలా వరకూ ఇళ్ళల్లోనే ఉంటూ వస్తున్నారు. కొందరు ఇల్లు మొత్తం ఎలా శుభ్రం చెయ్యాలి వంటల్లో స్పెషల్స్ ఎలా అంటూ వీడియోలు పెడుతున్నారు. అంతే కాదు మరికొందరు అయితే బ్యూటీ టిప్స్ కు సంబంధించిన వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. రకుల్ వంటి హీరోయిన్లు అయితే జిమ్ ఎలా చెయ్యాలి.. అంటూ టిప్స్ చెప్పింది.
అక్కడితో అయిపోలేదు వింత వింత ఛాలెంజ్ లు అంటూ త్రో బ్యాక్ పిక్స్ ను షేర్ చేస్తూ వారి ఫ్యాన్స్ ను ఖుషీ చేయిస్తున్నారు. అయితే మన మెగాస్టార్ ఇంటికోడలు మాత్రం అపోలో హాస్పిటల్ యాజమాన్యం ద్వారా పేద సినీ కళాకారులకు మెడిసిన్స్ వంటివి పంపిణి చేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ.. మొన్నటికి మొన్న టాయిలెట్ పొజిషన్ ఎలా ఉండాలి అంటూ ఫోటోలను పోస్ట్ చేసింది. అసలు అలాంటి ఫోజ్ లు పెట్టి ఫోటోలు పోస్ట్ చెయ్యాలి అంటే చాలా గట్స్ కావాలి.
ఎంతో మంది ట్రోల్ చేస్తారు అనే నామోషి ఫీలింగ్ లేకుండా ఆ ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ మానవత్వాన్ని పరిచయం చేసింది. ఇక ఇప్పుడైతే తన తండ్రి వద్ద సేంద్రీయ వ్యవసాయాన్ని నేర్చుకుంటూ… అలాగే పశువుల దగ్గర ఉండే ఏరియాని కూడా క్లీన్ చేస్తూ ఫోటోలు పెట్టింది. పేడ చేత్తో పట్టుకుని ఉన్న ఫోటోలని సైతం పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాంటి నామోషి అన్న ఫీలింగ్ లేకుండా ఏమే చేసే పనులు.. చెయ్యడానికి ఏ హీరోయిన్ కూడా ముందుకు రాలేదేమో.
Most Recommended Video
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!