Kim Sharma: కిమ్‌ శర్మ కొత్త బాయ్‌ ఫ్రెండ్‌ తెలిసినోడే!

కిమ్ శర్మ అంటే మనకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ… ఆమె హాట్‌ స్టెప్పులేసిన పాట గురించి చెబితే ఠక్కున గుర్తు పట్టేస్తారు. అదే ‘ఖడ్గం’ సినిమాలోని ‘ముసుగు మేయొద్దు మనసు మీద…’. అందులో కిమ్‌ వేసిన హాట్‌ మూమెంట్స్‌ తర్వాత సినిమాలో అప్పీయరెన్స్‌.. భామను గుర్తుండిపోయేలా చేశాయి. ఆ తర్వాత ‘మగధీర’లో కూడా కాసేపు మెరిసింది. అయితే కిమ్‌ సినిమాల కంటే ప్రేమ వ్యవహారాలతో బాలీవుడ్‌లో బిజీ. ఈ క్రమంలో తాజాగా నాలుగో బాయ్‌ ఫ్రెండ్‌ను పట్టేసిందని టాక్‌.

కిమ్‌ శర్మకు ఇప్పటివరకు ముగ్గురు బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. తాజాగా నాలుగో వ్యక్తి వచ్చారు. తొలి ముగ్గురులో ఇద్దరు మనకు బాగా తెలిసినవారే. ఇప్పుడు నాలుగో వ్యక్తి ఇంకా బాగా తెలుసు. ముందు లేటెస్ట్‌ వ్యక్తి గురించి చెప్పుకున్నాక… తర్వాత పాత ఇద్దరి గురించి చూద్దాం. కిమ్‌ శర్మ కావాలని చేసిందో లేక పొరపాటున జరిగిందో కానీ… గోవాలోని ఓ రిసార్ట్‌లో దిగిన ఫొటోలు ఆ రిసార్ట్‌ యాజమాన్యం బయటకు షేర్‌ చేసింది. వాటిని చూడగానే అందరూ షాక్‌. కారణం అందులో కిమ్‌ శర్మ… ప్రముఖ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ ఒడిలో ఒదిగిపోయి కనిపిస్తోంది.

అయితే కిమ్‌ శర్మ సోషల్‌ మీడియా పేజీలో ఓ ఫొటో కింద ‘మిస్టర్‌ .పి’ అని రాసి ఉంది. ఈ లెక్కన ‘మిస్టర్‌ పి’ ఎవరో కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కడం ఇదే తొలిసారి కాదు. అయితే ఇలా కనిపించడం మాత్రం ఇది తొలిసారి. దీంతో కిమ్‌కి నాలుగో బాయ్‌ఫ్రెండ్‌ అని సోషల్‌ మీడియాలో అంటున్నారు. ఇక ఆ మిగిలిన ముగ్గురు చూసుకుంటే… తొలుత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌. 2007లో వీరి ప్రేమాయణం జరిగిందని టాక్‌. ఆ తర్వాత 2010లో కిమ్‌… ఓ కెన్యా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొంది. అక్కడికి ఆరేళ్లకు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులు నటుడు హర్షవర్దన్‌ రాణేతో ప్రేమాయణం సాగించింది. ఇదన్నమాట లెక్క.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus