ప్రమోషన్ల జోరు మరింత పెంచుతున్నారుగా..!

ఈసారి 2020 సంక్రాంతికి పెద్ద పోటీనే ఉంది. మహేష్ బాబు, రజినీకాంత్ వంటి సూపర్ స్టార్లతో అల్లు అర్జున్ తలబడనున్నాడు. ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా 2020 జనవరి 12న విడుదల కాబోతుంది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ మరియు ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పెద్ద పోటీ మధ్యలో విడుదల కాబోతున్న సినిమా కావడంతో 3 నెలల ముందు నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పాటు.. సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అంతే కాదు ఈ పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. త్వరలోనే మరో సర్ ప్రైజ్ ఇవ్వడానికి కూడా చిత్ర యూనిట్ సభ్యులు రెడీ అయ్యారట. నవంబర్ 14 న ఈ సర్ ప్రైజ్ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఆ సర్ ప్రైజ్ టీజరా.. ? లేక మరో పాట విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రమోషన్ల డోస్ మరింత పెంచబోతున్నారని మాత్రం స్పష్టమవుతుంది.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus