Oorellipota Mama: ‘ఊరెళ్ళి పోతా మామ’ చిత్రానికి ‘ఆహా’ లో సూపర్ రెస్పాన్స్

  • July 11, 2022 / 07:32 PM IST

యువ కథానాయకుడు శ్రీ మానస్ నటించిన ‘ఊరెళ్ళి పోతా మామ’ చిత్రం ఇప్పుడు ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.మెరీనా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వరుణ్ శుభలేఖ సుధాకర్, మహేష్ విట్టా, టిఎన్ఆర్, మ్యాడి, సెహరా పద్మాజయంతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అంజన్ రెడ్డి దర్శకత్వంలో తాడిపత్రి వెంకట కొండారెడ్డి- జి దామోదర్ రెడ్డి – ఎస్ మారుతి ప్రసాద్ -కె హిమాన్విత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ ‘ఊరెళ్ళి పోతా మామా’ చిత్రానికి ‘ఆహా’ లో అమితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ విజయం పై హీరో శ్రీ మానస్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. శర్వానంద్, శ్రీ విష్ణు వంటి హీరోలను పరిచయం చేసిన మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ దొరైరాజ్ .. ‘పటారుపాలెం ప్రేమకథ’ తో శ్రీ మానస్ ను హీరోగా పరిచయం చేశారు. ‘పటారుపాలెం ప్రేమకథ’తో హీరోగా తన ప్రతిభను చాటుకుని… ‘ఊరెళ్ళిపోతా మామా’ సాధిస్తున్న అనూహ్య విజయాన్ని అమితంగా ఆస్వాదిస్తున్నాడు శ్రీ మానస్. కరోనా కష్టకాలంలో రైతులు పడ్డ ఇబ్బందులు, వ్యవసాయం యొక్క గొప్పతనం ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది.

కుటుంబ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అంజన్ రెడ్డి తీర్చిదిద్దాడు. ఇందులోని సంభాషణలు కూడా అందరి గుండెల్లో నిలిచిపోయేవిగా ఉన్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus