Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రాజ్ తరుణ్ (Hero)
  • రాశి సింగ్ (Heroine)
  • సుదర్శన్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, నితిన్ ప్రసన్న తదితరులు (Cast)
  • రమేష్ కడుముల (Director)
  • మాధవి - ఎం.ఎస్.ఎం.రెడ్డి (Producer)
  • శేఖర్ చంద్ర (Music)
  • ఆదిత్య జవ్వాది (Cinematography)
  • ప్రవీణ్ పూడి (Editor)
  • Release Date : నవంబర్ 21, 2025
  • కనెక్ట్ మూవీస్ (Banner)

వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న రాజ్ తరుణ్ ఆల్మోస్ట్ ఏడాది విరామం అనంతరం “పాంచ్ మినార్” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుంది? రాజ్ తరుణ్ హీరోగా హిట్టు కొట్టాడా? అనేది చూద్దాం..!!

Paanch Minar Movie Review

కథ: సరైన ఉద్యోగం సంపాదించలేక, కుటుంబ సభ్యులు & లవర్ దగ్గర సరైన రెస్పెక్ట్ లేక ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనే ధ్యేయంతో రకరకాల స్కీముల్లో పాల్గొని స్కాం అవుతుంటాడు కిట్టు అలియాస్ కృష్ణచైతన్య (రాజ్ తరుణ్).

అటువంటి కిట్టు అనుకొని విధంగా ఒకేరోజు ఒక హత్య కేసు, ఒక మనీ లాండరింగ్ క్రైమ్ లో ఇరుక్కుంటాడు. ఒక్కసారిగా తలెత్తిన సమస్యలను కిట్టు ఎలా డీల్ చేశాడు? ఈ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? చివరికి బయటపడగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే “పాంచ్ మినార్” చిత్రం.

నటీనటుల పనితీరు: చాన్నాళ్ల తర్వాత రాజ్ తరుణ్ ఈ సినిమాలో కొంచం ఫ్రెష్ గా కనిపించాడు. అయితే.. ఇంకాస్త యాక్టివ్ గా ఉంటే బాగుండు అనిపించింది. కొన్ని పాటల్లో, చాలా సన్నివేశాల్లో అస్సలు ఆసక్తి లేనట్లు కనిపించాడు. అయితే.. క్యారెక్టర్ ను మాత్రం బాగా క్యారీ చేశాడు.

రాశి సింగ్ కి ఉన్న సన్నివేశాలు తక్కువే అయినప్పటికీ.. కనిపించే కాసేపు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

అజయ్ ఘోష్ కామెడీ అలరిస్తుంది. నితిన్ ప్రసన్న, జీవా, రవివర్మ, లక్ష్మణ్ మీసాల వంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నప్పటికీ.. అవన్నీ క్యారెక్టర్ రోల్స్ లా మిగిలిపోయాయి కానీ.. ఎవరి పాత్ర పెద్దగా గుర్తుండదు.

బ్రహ్మాజీ మెల్లమెల్లగా తండ్రి పాత్రలకు మొగ్గుచూపుతుండడం మంచి నిర్ణయం. అమాయక తల్లి పాత్రలో బిందు మరోసారి తనదైన స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించింది. సుదర్శన్ పంచులు బాగానే నవ్వించాయి.

సాంకేతికవర్గం పనితీరు: మొదటిసారి శేఖర్ చంద్ర సంగీతంలో ఒరిజినాలిటీ కనిపించలేదు. ట్రెండ్ కి తగ్గట్లు మీమ్స్ ఎక్కువగా వాడడమే అందుకు కారణం. అయితే.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో మాత్రం సినిమాని ఆసక్తికరంగా మలచడంలో కీలకపాత్ర పోషించాడు.

ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకాస్త సహకరించి ఉంటే ఇంకా బెటర్ అవుట్ పుట్ ఇచ్చేవాడేమో. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వల్ల కన్ఫ్యూజన్ లేకుండా సినిమా క్లారిటీగా అర్థమైంది.

దర్శకుడు రమేష్ కడుముల క్రైమ్ కామెడీకి కన్ఫ్యూజన్ ను యాడ్ చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ కారణంగా తొలిభాగం ఆసక్తి రేకెత్తించడంలో తడబడగా.. సెకండాఫ్ కి పేస్ సెట్ అయ్యి, డీసెంట్ గా ఎంగేజ్ చేయగలిగింది. ముఖ్యంగా ఆఖరి 15 నిమిషాలు మాత్రం బాగా రాసుకున్నాడు. కాస్త బెటర్ బడ్జెట్ సపోర్ట్ ఉంటే గనుక.. ఇంకాస్త బాగా తీయగలిగేవాడేమో. అందువల్ల.. దర్శకుడిగా కంటే రచయితగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

విశ్లేషణ: రాజ్ తరుణ్ గత అయిదారేళ్ళలో చేసిన చాలా సినిమాల కంటే “పాంచ్ మినార్” చాలా బెటర్ సినిమా. పైన పేర్కొన్నట్లుగా ఇంకాస్త బెటర్ ప్రొడక్షన్ సపోర్ట్ ఉండుంటే.. క్వాలిటీ అవుట్ పుట్ వచ్చేది. అయినప్పటికీ.. కామెడీ, సస్పెన్స్ కలగలిపిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేయదు. మంచిగా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేస్తే.. కమర్షియల్ గా హిట్టయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమా ఇది.

ఫోకస్ పాయింట్: ఎంగేజింగ్ క్రైమ్ కామెడీ!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus