Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో సంచలన నిజాలు చెప్పిన పల్లవి ప్రశాంత్..! ఏం జరిగిందంటే.,

  • September 27, 2023 / 10:59 AM IST

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అంటేనే ఒక రేంజ్ లో హీట్ పుట్టిస్తాయి. 4వ వారం కూడా అదే జరిగింది. జ్యూరీ మెంబర్స్ సాక్షిగా హౌస్ మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ రెచ్చిపోయి వాగ్వివాదం చేసుకున్నారు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఆఖరి రౌండ్ లో నామినేషన్స్ కి వచ్చాడు. అమర్ ని ఇంకా గౌతమ్ ని నామినేట్ చేస్తూ కొన్ని పాయింట్స్ చెప్పాడు. ఇవి వీకండ్ నాగార్జున హౌస్ మేట్స్ ని కడిగేసిన పాయింట్సే. బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ రావడం చాలా గొప్ప అలాంటింది నీకు గుండు కొట్టించుకోమని ఛాన్స్ వచ్చింది.

కంటెండర్ అయ్యేవాడివి కానీ నువ్వు ఆ పని చేయలేదు అనే రీజన్ చెప్పి అమర్ ని నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంకతో వాదన కూడా చేయలేదని చెప్పాడు. తర్వాత గౌతమ్ ని నామినేట్ చేస్తూ నువ్వు అమ్మాయి ముందు షర్ట్ విప్పి మాట్లాడటం నాకు నచ్చలేదన్నాడు. శోభాశెట్టికి – గౌతమ్ ని గొడవ అయినపుడు గౌతమ్ షర్ట్ విప్పి తనకి తగిలిన దెబ్బని చూపించబోయాడు. కానీ, అక్కడ శోభాశెట్టి షోకి నీ బాడీ చూడటానికి రాలేదనే డైలాగ్ వేసిది. అలాగే షోఆఫ్ చేయకు అని చెప్పింది.

దీనికి గౌతమ్ నువ్వు కూడా షో ఆఫ్ చేయకు అని అన్నాడు. ఈ పాయింట్ ని పల్లవి ప్రశాంత్ చెప్తూ.., నువ్వు శోభాశెట్టిని షోఆఫ్ చేయకు అని చేతులు ఇలా అమ్మాయి షేప్ లో చూపించావని అన్నాడు. అది నాకు సెక్సీ సింబల్ గా అనిపించిందని అన్నాడు. దీంతో గౌతమ్ అవాక్కయ్యాడు. అది నేను ఆబ్జక్టిఫై చేయలేదని క్లియర్ గా చెప్పాడు. జనరల్ గా నువ్వు కూడా షోహాఫ్ చేయకు అని మాత్రమే చెప్పానని డిపెండ్ చేసుకున్నాడు.

ఈ విషయంలో గౌతమ్ కి ఇంకా పల్లవి ప్రశాంత్ కి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. మద్యలో రతికని ఇన్వాల్ చేసిన గౌతమ్ నిన్ను కూడా పొట్టి బట్టలు వేసుకోకు అని ప్రశాంత్ చెప్పాడా లేదా అని అడిగాడు. దీనికి అవును అన్నట్లుగా రతిక సమాధానం చెప్పింది. ఇక హ్యాండ్ తో స్టేచర్ చేసి చూపించాడా లేదా అనేది జ్యూరీ మెంబర్స్ కి తెలియకుండానే గౌతమ్ ని నామినేట్ చేశారు.

ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ గా స్టాండ్ బై తీస్కుంటావా అని అడిగారు. దీనికి యస్ అన్నాడు పల్లవి ప్రశాంత్. ఇక గౌతమ్ పై అంత పెద్ద నింద పడిన తర్వాత గౌతమ్ షర్ట్ విప్పేసి నేను ఇలాగే షర్ట్ విప్పి ఉంటే ఎవరికి ఏమైనా ప్రాబ్లమా అంటూ సీన్ చేశాడు. మొత్తానికి వీళ్లిద్దరికీ గట్టిగానే ఆర్గ్యూమెంట్ అయ్యింది. మరి వీకెండ్గౌ (Bigg Boss 7 Telugu) తమ్ సేఫ్ అవుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus