Bigg Boss 7 Telugu: హౌస్ మేట్స్ చేసిన పనివల్లే కెప్టెన్సీ పోయిందా ? లైవ్ టెలికాస్ట్ లో ఏం జరిగిందంటే.,

బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ఇంటి మొదటి కెప్టెన్ అయ్యాడు. అయితే, గత రెండు మూడు రోజులుగా ఇంట్లో సినారియో మారిపోయింది. దీంతో బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ కి వార్నింగ్ ఇచ్చాడు. కెప్టెన్సీ అంటే కేవలం ఇమ్యూనిటీ మాత్రమే కాదు అని చాలా బాధ్యతలు ఉంటాయని చెప్పాడు బిగ్బాస్. ఇది హౌస్ మేట్స్ అందరితో కూడా చెప్పించాడు. దీంతో పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జిని వదులుకోవాల్సి వచ్చింది. అయితే, తెరవెనుక చాలా విషయాలు జరిగాయని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అవేంటంటే.,

హౌస్ మేట్స్ ద్వారా ఆపరేషన్ ప్రశాంత్ స్టార్ట్ అయ్యిందా అంటే నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే, కెప్టెన్సీ బిగ్ బాస్ చివాట్లు పెట్టాడానికి కారణం ఇదే అని తెలుస్తోంది. తేజ నిద్రపోతున్నాడని పనిష్మెంట్ ఇవ్వమంటే నేను ఇస్తా అని శోభా, శివాజీ అనడం ప్రశాంత్ కెప్టెన్ లేడా అని బిగ్ బాస్ కౌంటర్ వేయడం జరిగింది. అలాగే, లైవ్ లో కంటెంట్ టెలికాస్ట్ అయిన దాన్ని బట్టీ చూస్తే భోళే షవాలి ప్రశాంత్, శివాజీల క్రేజ్ గురించి లీక్స్ ఇచ్చాడు. దీంతో ప్రశాంత్ , భోళే బాగా దగ్గరయ్యారు.

అందుకే, కిచెన్ లో భోళే కి ఎదురులేకుండా పోయింది. దీంతో ప్రియాంకకి భోళేకి ఫుడ్ విషయంలో క్లాషెష్ వచ్చాయి. ఫస్ట్ మార్నింగ్ రైస్ దగ్గర లొల్లి వచ్చింది. ప్రియాంక చెప్తున్నా కూడా వినిపించుకోలేదని తనకి బాధేసిందని చెప్పింది. అలాగే తర్వాత కూడా టమోటాలు కట్ చేయద్దు అంటే నయనీ కట్ చేసిందని చెప్పింది. టమోటా రైస్ వద్దని చెప్పినా కూడా వినిలేదు అందుకే బాధేసిందని శోభాతో చెప్పింది ప్రియాంక.ఆ తర్వాత విషయం పల్లవి ప్రశాంత్ కి తెలిసి భోళేని కిచెన్ లోకి రాకుండా చేస్తానని చెప్పాడు.

అ యినా కూడా ప్రశాంత్ మాటలు హౌస్ లో ఎవరూ పట్టించుకోవడం లేదు అనేది వాస్తవం. నిజానికి గత రెండు మూడు రోజులుగా ఇదే కంటెంట్ వస్తోంది. ఇలా హౌస్ మేట్స్ చెప్పడం వెనక అసలు ఆపరేషన్ అనేది ఉంది. గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచీ వచ్చిన తర్వాత ప్రశాంత్ ని విష్ చేయలేదు. దీంతో హౌస్ మేట్స్ పనిచేయడంలో విఫలం అయ్యారు. కెప్టెన్ గా ప్రశాంత్ కూడా ఫైయిల్ అయ్యాడని అనిపించారు. అందుకే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ పోయింది.

ఈవిషయంలో శివాజీ కూడా ప్రశాంత్ ని బ్యాడ్ కెప్టెన్ అని ఓటు వేశాడు. నాకు ఎవరైనా ఒకటే అని చెప్పాడనికి అలాగే మిగతా హౌస్ మేట్స్ కి కూడా తెలియజెప్పడానికి శివాజీ చేయి ఎత్తక తప్పలేదు. మరోవైపు కొత్తగా వచ్చిన పోటుగాళ్లకి కూడా ప్రశాంత్ కెప్టెన్ అవుతాడని మర్చిపోయాడు. హెడ్ ఆఫ్ లగేజ్, అలాగే హెడ్ ఆఫ్ బెడ్స్ పైన కూడా అతనికి అధికారం ఉంది. వాళ్ల డ్యూటీలు కూడా వాళ్లు చేసేలా చూడాల్సిన బాధ్యత ప్రశాంత్ దే. అందుకే, బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus