Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 6 లోనే పాల్గొని సందడి చేసిన ప్రశాంత్.. వీడియో వైరల్!

  • October 4, 2023 / 09:35 PM IST

బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఏడవ సీజన్ ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ఇప్పటికే నాలుగు వారాలను పూర్తిచేసుకుని ఐదవ వారం ప్రసారం అవుతుంది. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసేసారు ఇక ఈ కార్యక్రమంలో కామన్ మ్యాన్ క్యాటగిరి లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మొదట్లో పల్లవి ప్రశాంత్ హౌస్ మెట్ల నుంచి కాస్త నెగిటివిటీని ఎదుర్కొన్నారు.

రైతు బిడ్డ అంటూ హేళన చేస్తూ మాట్లాడారు కానీ వారి కన్నా తానే ఎంతో బెటర్ అంటూ బిగ్ బాస్ నిర్వహించినటువంటి టాస్కులలో భారీ స్థాయిలో పోటీపడుతూ ఏకంగా పవర్ అస్త్ర కూడా సాధించారు. అయితే ఈయన ఎప్పటి నుంచో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనాలని కలలు కంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి రావాలని కోరిక ఉంది అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు.

దీంతో ఈయనకు (Pallavi Prashanth) సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే ఈయన బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కూడా సందడి చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ప్రశాంత్ కంటిస్టెంట్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారా అనే విషయానికి వస్తే ఈయన కంటెస్టెంట్ గా ఈ సీజన్లో పాల్గొనలేదు.

కానీ వీకెండ్ నాగార్జున వేదిక పైకి వచ్చి హౌస్ మేట్లతో మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా కొందరు ఆడియన్స్ బిగ్ బాస్ సెట్ లో సందడి చేస్తూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఇలా బిగ్ బాస్ 6 సమయంలో ఒక ఆడియన్ గా ఆ సెట్ లో ఉన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబందించి వీడియో వైరల్ అవుతుంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus