Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఖాతాలో రేర్ రికార్డ్.. ఏం జరిగిందంటే?

  • November 21, 2023 / 08:56 PM IST

బిగ్ బాస్ షోలో అడుగు పెట్టాలని కలలు కన్న పల్లవి ప్రశాంత్ ఎంతో కష్టపడి ఆ కలను నిజం చేసుకున్నారు. రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ ఖాతాలో అరుదైన ఘనత చేరడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఆర్మాక్స్ సర్వే మోస్ట్ పాపులర్ నా ఫిక్షనల్ పర్సనాలిటీస్ లో పల్లవి ప్రశాంత్ నాలుగో స్థానంలో నిలిచారు.

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, సునామి సుధాకర్ మొదటి మూడు స్థానాల్లో నిలవగా పల్లవి ప్రశాంత్ నాలుగో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఐదో స్థానంలో శేఖర్ మాస్టర్ నిలిచారు. పల్లవి ప్రశాంత్ కు ఇప్పటికే సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోకు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా కూడా భారీ స్థాయిలోనే ఆదాయం దక్కుతోందని సమాచారం అందుతోంది. పెరిగిన క్రేజ్ పల్లవి ప్రశాంత్ కు మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. పల్లవి ప్రశాంత్ కు మూవీ మూవీ ఆఫర్లు కూడా వస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) టాప్5 జాబితాలో కచ్చితంగా నిలవనున్నారు. పల్లవి ప్రశాంత్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. బిగ్ బాస్ షో ద్వారా కొంతమంది కంటెస్టెంట్లకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదిరెడ్డి నెల ఆదాయం 39 లక్షల రూపాయల రేంజ్ లో ఉంది. బిగ్ బాస్ షో ఎంతోమంది జీవితాలను మార్చింది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus