Pallavi Prashanth: హాట్ టాపిక్ గా మారిన పల్లవి ప్రశాంత్ పెళ్లి ఫోటో..!

  • October 17, 2023 / 12:15 PM IST

‘బిగ్ బాస్ 7 ‘ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి హౌస్ లోకి కూడా అదే ట్యాగ్ ఎంట్రీ ఇచ్చాడు. కొన్నాళ్ల పాటు అదే ట్యాగ్ ను అతను మిగిలిన కంటెస్టెంట్ ల వద్ద ఉపయోగిస్తూ మాట్లాడటం వల్ల.. అతను సింపతీ గేమ్ ఆడుతున్నాడు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు అదే ట్యాగ్ తో అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నాడంటూ కొందరు నెటిజన్లు కూడా ట్రోల్ చేశారు.

అయితే చూడటానికి బక్కగా కనిపిస్తున్నప్పటికీ ఫిజికల్ టాస్క్ లు వంటివి ఇతను బలంగా ఆడుతూ ఆ విమర్శలకి చెక్ పెట్టాడు. దీంతో అతను బాగానే పికప్ అయ్యాడు అని అంతా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఇతను చోటు సంపాదించుకోవడం ఖాయం అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఇతను నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఇదిలా ఉండగా.. (Pallavi Prashanth) పల్లవి ప్రశాంత్ కి పెళ్లైంది అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది.

మరోపక్క ఇతనికి కోట్ల ఆస్తి ఉంది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వీటి పై క్లారిటీ ఇచ్చారు. ‘మేము కోటీశ్వరులం అంటూ జరుగుతున్నా ప్రచారంలో నిజం లేదు. మా అబ్బాయి హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే పెళ్లి చేయాలి అనుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆ ఫోటో ఏదైనా షార్ట్ ఫిలింకి సంబంధించింది అయ్యుండొచ్చు అని కొందరు భావిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus