టాలీవుడ్ బ్యూటీ క్వీన్ అనుష్క శెట్టి తన అభిమానులను గత కొన్ని సంవత్సరాలుగా వెండితెరపై ఎక్కువగా కనిపించకుండా నిరుత్సాహపరిచింది. అయితే, ఇప్పుడు ఆమె తన కొత్త ప్రాజెక్ట్ “ఘాటీ”తో పునరాగమనం చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అనుష్క ఫ్యాన్స్‌కి భారీ ట్రీట్‌గా రాబోతోంది.
“ఘాటీ” టీజర్ ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలు పెంచింది. అనుష్క తన మాస్ యాంగిల్‌ను మరోసారి చూపించబోతోందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. “అరుంధతి,” “రుద్రమదేవి” వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్‌ను ఈ సినిమాతో మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. క్రిష్ కూడా ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా పర్ఫెక్ట్ ప్లాన్ తో కసిగా వర్క్ చేస్తున్నారట.
సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న “రాజా సాబ్” కూడా రిలీజ్‌కు సిద్ధమవుతుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది “ఘాటీ”కి మరింత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అందుకే, ప్రమోషన్స్‌ను మరింత జోరుగా తీసుకెళ్లాలని యూవీ క్రియేషన్స్ నిర్ణయించిందట. అనుష్క కోసం రీచ్ పెంచే విధంగా రెబల్ స్టార్ ప్రభాస్‌ను కూడా ప్రమోషన్స్‌లో భాగం చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండటం, అలాగే యూవీ బ్యానర్‌కు ఆయన దగ్గర ఉండటం ఈ నిర్ణయానికి బలంగా నిలిచాయి. అనుష్కతో పాటు ప్రభాస్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే, ఈ సినిమా మంచి హైప్ తెచ్చుకోగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.