Jr NTR: లుక్‌ టోటల్‌ బ్లాక్‌.. కథ వింటే మైండ్‌ బ్లాక్‌.. తారక్‌ – నీల్‌ ప్రాజెక్ట్‌ కొత్త రూమర్స్‌!

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. న‌టీన‌టుల ఎంపిక తదితర పనులు ఓ కొలిక్కి తీసుకొచ్చిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ త్వరలో యాక్షన్‌ చెప్పడానికి రెడీ అవుతుననారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరి నెల మూడో వారంలో సినిమా షూటింగ్‌ కర్ణాటకలో మొదలవుతుంది చెబుతున్నారు. ఈ మేరకు అక్కడ భారీ సెట్లు రూపొందిస్తున్నారు.

Jr NTR

ఈ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మూడు పవర్‌ హౌస్‌లను కలుపుతున్నారట. మలయాళ స్టార్‌ నటులు బిజూ మీన‌న్‌, టొవినో థామ‌స్‌ ఈ సినిమాల్లోకి నటిస్తున్నారు అని సమాచారం. ఈ సినిమా డ్ర‌గ్ మాఫియా చుట్టూ తిరుగుతుంద‌ని టాక్‌. మ‌య‌న్మార్‌, థాయ్ లాండ్‌, లాయిస్‌ దేశాలను క‌లిపి భౌగోళికంగా గోల్డెన్ ట్ర‌యాంగిల్ అంటుంటారు. డ్ర‌గ్ సామ్రాజ్యానికి అదో స్వ‌ర్గం లాంటిది అంటారు. అక్కడ కొకైన్‌, గంజాయి ఎక్కువ‌గా స్మ‌గ్లింగ్ అవుతుంటుంది. ఆ నేపథ్యంలోనే ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ‘డ్రాగన్‌’ అనే పేరు తొలినాళ్లలో వినిపించింది. అయితే పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమా వస్తుండటంతో ఇతర ఇండస్ట్రీల్లో ఆ పేరు అందుబాటులో లేదు. దీంతో పేరు మార్చే ఆలోచనలో ఉందట సినిమా టీమ్‌. ఇక ఈ సినిమా కోసం ఎప్పటిలాగే ప్రశాంత్ నీల్‌ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉన్నారట. రెండు పార్టులుగా రూపొందుతుంది అని చెబుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌.

2026 సంక్రాంతికి ఈ సినిమా తొలి పార్టును విడుద‌ల చేయాల‌నేది మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ ప్లాన్‌. అయితే షూటింగ్‌ అప్‌డేట్స్‌ బట్టి ఆ డేట్‌ ఉంటుంది అని చెప్పాలి. ఇక మూడో వారంలో తొలి షెడ్యూల్‌ను రిషభ్‌ శెట్టి సొంత ప్రాంతం కుందాపుర్‌ దగ్గర తెరకెక్కిస్తారని టాక్‌ నడుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ టీమ్‌ నుండి రావాల్సి ఉంది.

ఫౌజీ పాపకు మరో జాక్ పాట్.. డిమాండ్ అలా ఉంది మరి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus