Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

రామ్ పోతినేని హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన కామిడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘పండగ చేస్కో'(Pandaga Chesko). రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

Pandaga Chesko Collections

2015 లో మే 29న పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ అయ్యింది ఈ సినిమా. టాక్ కూడా మిక్స్డ్ గానే వచ్చింది. పైగా రామ్ ఆ టైమ్లో ‘ఎందుకంటే ప్రేమంట’ ‘ఒంగోలు గిత్త’ ‘మసాలా’ వంటి సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కొంత డల్ అయ్యాడు.

అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి మంచి వసూళ్ళు వచ్చాయి. సెకండాఫ్లో బ్రహ్మానందం కామిడీ వర్కౌట్ అవ్వడంతో మాస్ ఆడియన్స్ ఎగబడి చూశారు ఈ సినిమాని. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి ‘పండగ చేస్కో’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 4.80 cr
సీడెడ్ 2.55 cr
ఉత్తరాంధ్ర 1.85 cr
ఈస్ట్ 1.15 cr
వెస్ట్ 1.05 cr
గుంటూరు 1.30 cr
కృష్ణా 1.06 cr
నెల్లూరు 0.54 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 1.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 15.86 cr

‘పండగ చేస్కో’ చిత్రం రూ.15.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.15.86 కోట్ల షేర్ ను రాబట్టి క్లీన్ హిట్ గా నిలిచింది. ఆ ఏడాది కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పాలి.

రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus