తెలుగులో పా…పా… మూవీ ఫస్ట్ లుక్!

తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన దా…దా… మూవీ ఒలింపియా మూవీస్ సంస్థ ఎస్ అంబేత్ కుమార్ సమర్పించగా తెలుగులో శ్రీమతి నీరజ సమర్పించు పాన్ ఇండియా మూవీస్ మరియు జె కె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా శ్రీ ఎమ్మెస్ రెడ్డి గారు నిర్మాతగా శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సహనిర్మాతలుగా పా…పా… గా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మత M.S.రెడ్డి గారు మాట్లాడుతు తమిళంలో మంచి యూత్‌ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచి కొన్ని కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన దా…దా…ని పా…పా…గా తెలుగులో తీసు కొస్తున్నాం.

ఎన్నో పెద్ద సంస్థలు పోటీ పడిన తెలుగులో ఇలాంటి సినిమాని మా సంస్థ తీసుకురావాలని మంచి మొత్తం పెట్టి విడుదల చేయడానికీ రెడీ అయ్యాము. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసాము అలానే అతి త్వరలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ తో మీ ముందుకు రాబోతున్నాము. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు అలానే పా…పా…ని కూడా తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ చెయ్యాలని చేస్తారని ఆశిస్తున్నాము.

తారాగణం : కవిన్, అపర్ణా దాస్, మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, వి టి వి గణేష్.
DOP: ఎళిల్ అరసు కె
ఎడిటర్: కతిరేష్ అళగేశన్
సంగీతం: జెన్ మార్టిన్
నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి
దర్శకుడు: గణేష్ కె బాబు
పి ఆర్ ఓ: మధు VR

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags