‘గీత గోవిందం’ ‘సర్కారు వారి పాట’ వంటి బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు అందించిన దర్శకుడు పరశురామ్(Parasuram)… ‘ఫ్యామిలీ స్టార్’ తో మాత్రం డౌన్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి ఇంకో సినిమా సెట్ అవ్వలేదు.ఓ కథ రెడీ చేసుకుని చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు పరశురామ్ . అది పెద్ద స్పాన్ తో కూడుకున్నది. పాన్ ఇండియా లేదా ద్విభాషా చిత్రంగా అయితేనే వర్కౌట్ అవుతుంది. అందుకే పక్క భాషల్లోని హీరోలను కూడా చుట్టేసి వచ్చాడు పరశురామ్.
శివ కార్తికేయన్ దగ్గర మొదలుపెట్టి కార్తీ.. అలా చివరికి సూర్య వద్దకి వచ్చి ఆగింది బండి.సూర్యకి పరశురామ్ చెప్పిన పాయింట్ నచ్చింది. కానీ యెస్ చెప్పలేదు. నో అని కూడా చెప్పేసి పరశురామ్ ని పంపలేదు. హోల్డ్ లో అయితే పెట్టాడు అని తెలుస్తుంది. సూర్యకి చాలా కాలంగా హిట్టు లేదు. ఇప్పుడు అతనికి తమిళ దర్శకులపై నమ్మకం లేదు. విజయ్ కి ‘వారసుడు’, ధనుష్ కి ‘సార్’ ‘కుబేర’ వంటి హిట్లు ఇచ్చింది తెలుగు దర్శకులే.
అందుకే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథం అండ్ సన్స్’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా బాగా వస్తుంది అనే నమ్మకం సూర్యకి కలిగింది. ఇదే కాన్ఫిడెన్స్ తో పరశురామ్ కథ కూడా ఓకే చేసే అవకాశాలు లేకపోలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్టుని దిల్ రాజు నిర్మిస్తారనే టాక్ కూడా నడుస్తుంది.