Pathaan Collections: తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పఠాన్’..!

  • January 28, 2023 / 09:00 PM IST

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కలుపుకుని పాన్ ఇండియా మూవీ వరల్డ్ లోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన ఇండియన్ సినిమాగా… రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కు జోడీగా దీపిక పదుకొణె నటించింది.

జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. దీంతో జనవరి 25న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయనే చెప్పాలి.మూడో రోజు కూడా ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.25 cr
సీడెడ్ 0.71 cr
ఆంధ్ర(టోటల్) 1.04 cr
ఏపీ + తెలంగాణ 4.00 cr

‘పఠాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.96 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.హిందీ మరియు తెలుగు వెర్షన్లు కలుపుకుని ఇంత బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితుల సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగులో ‘పఠాన్’ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మూడు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.4.64 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసింది.అంతేకాదు బయ్యర్లకు రూ.0.39 కోట్ల లాభాలు కూడా దక్కాయి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus