బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నుండి దాదాపు 4 ఏళ్ళ తర్వాత వస్తున్న చిత్రం ‘పఠాన్’. షారుఖ్ ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన ‘జీరో’ చిత్రం 2018 డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ‘పఠాన్’ లో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.షారుఖ్ – దీపికా జంటగా నటించిన ‘ఓం శాంతి ఓం’ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ వంటి చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. దీంతో ‘పఠాన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న మొదటి ఇండియన్ మూవీగా ‘పఠాన్’ ప్రసంశలు దక్కించుకుంటుంది. జనవరి 25న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ‘వార్’ వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు కావడం కూడా ఈ సినిమాపై హైప్ పెరగడానికి కారణమని చెప్పొచ్చు.
1) ఇక ‘పఠాన్’ చిత్రం 100కు పైగా దేశాల్లో రిలీజ్ కాబోతుంది. కేవలం ఓవర్సీస్‌లోనే 2500 కంటే ఎక్కువ స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం. ఇక ‘పఠాన్’ కు బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (BBFC).. 12A రేటింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. వయొలెన్స్, సె*స్, థ్రెట్స్ వంటి ప్రధాన అంశాలతో ఈ మూవీ తెరకెక్కినట్టు వెల్లడించింది బి.బి.ఎఫ్.సి.
2) ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. ఓ డేంజరస్ సింథటిక్ వైరస్ ను రిలీజ్ కాకుండా దేశాన్ని కాపాడేందుకు ఒక అండర్ కవర్ కాప్ అలాగే మాజీ నేరస్తుడు కలిసి నిర్వహించే మిషన్ ఆధారంగా ఈ మూవీ రూపొందిందట. ఈ చిత్రం నిడివి 2.26 గంటలు అని తెలుస్తుంది.
3) పాటల పిక్చరైజేషన్ బాగున్నా.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయట.
4) యాక్షన్ ప్రియులకు ఈ మూవీ ఐ ఫీస్ట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో నటించే పాత్రలు డేంజరస్ వైరస్ బారిన పడినప్పుడు వారి ముఖంపై భయంకరమైన కురుపులు కనిపిస్తాయని.. ఆ విజువల్స్ భయపెడతాయని తెలుస్తుంది.
5) అలాగే ఓ మహిళ తన మోకాలితో పురుషుని బాడీ పార్ట్స్‌ను క్లాత్స్ మీదుగా రుద్దడాన్ని జిగుప్సాకరంగా చిత్రీకరించినట్టు వినికిడి. ప్రాస్టిట్యూషన్ పై డైలాగులు కూడా ఈ మూవీలో ఉన్నాయని కూడా సమాచారం. ‘రూబుల్స్’కు బదులు ‘బూబుల్స్’ అనే పదాన్ని వాడటం కూడా వివాదాలకు తావిచ్చినట్టు ఉంటుంది అని ఇన్సైడ్ టాక్.
6) యాక్షన్ చిత్రం కావడంతో వయొలెన్స్‌కు కూడా పెద్ద పీట వేశారట. కాల్పులు, కత్తిపోట్లు, గొంతు కోయడాలు, పేలుళ్లు వంటి హింసాత్మక సన్నివేశాలు కూడా ఇందులో ఉంటాయట.
7) అలాగే ఈ చిత్రం నుండి ఓ సీన్‌ను డిలీట్ చేశారట. ఇండియాలో ‘పఠాన్’ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ UA సర్టిఫికెట్ ను జారీ చేసింది.
8) జాన్ అబ్రహం విలనిజం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందట.
9) ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ మాత్రం ఇబ్బంది పెట్టింది అని ఇన్సైడ్ టాక్.
10) పఠాన్ చిత్రం షారుఖ్ కు కంబ్యాక్ ఇస్తుందో లేదో అన్నది బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ పైనే ఆధారపడి ఉంటుంది అని బి.బి.ఎఫ్.సి తెలిపింది.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?