Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలు, నటి పవిత్రా గౌడ కోర్టుకు పెట్టుకున్న ఓ అర్జీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె పెట్టుకున్న అర్జీ 59వ సీసీహెచ్‌ కోర్టులో ఇటీవల వాదనలకు వచ్చింది. జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పవిత్రా గౌడ విచారణ హాజయ్యారు. ఈ క్రమంలో ఆమె కొన్ని విస్తుపోయే విషయాలను ఆ అర్జీలో పేర్కొనడం గురించి సమాచారం బయటకు వచ్చింది.

Pavithra Gowda

జైలులో కొంతమంది నైజీరియన్‌ మహిళలు వేధిస్తున్నారు అంటూ పవిత్రా గౌడ కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బెయిలు ఇవ్వాలని లేదా చనిపోయేందుకు విషం ఇవ్వాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. పవిత్రను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆమె తరఫు న్యాయవాదులు బాలన్, నారాయణస్వామి వాదనలు వినిపించారు. అయితే కోర్టు ఆదేశాలతో ఆమెను ఇప్పటికే మరో బ్యారక్‌కు మార్చామని సిట్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు.

కన్నడ నాట పెను సంచలనం సృష్టించిన హీరో దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఘటన జరిగిన రోజు నుండి సాక్ష్యాలను తారుమారు చేసే వరకు జరిగిన ప్రతీ విషయాన్ని తన అప్రూవర్‌ పిటిషన్‌లో చెప్పేశాడు.

ప్రదోష్‌ తన పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు ఇవీ అంటూ కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. పవిత్ర గౌడకు పంపిన మెసేజ్‌ల విషయంలో రేణుకా స్వామిని దర్శన్‌ నిలదీశారు. ఆ సమయంలో ఆయన తీవ్ర పదజాలంతో దూషిస్తూ దాడికి కూడా దిగారు. దాడి తీవ్రతకు రేణుకా స్వామి తల నుండి రక్తం కారింది. ఆ తర్వాత అక్కడికి పవిత్ర గౌడను పిలిపించి ఆమె చెప్పుతో కొట్టించారు. కాసేపటి తర్వాత రేణుకా స్వామి లోదుస్తులు మాత్రమే ఉంచి టాటా ఏస్‌కు వేలాడదీశారు. నైలాన్‌ తాడుతో కొట్టారు అని ప్రదోష్‌ తెలిపారు.

 ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus