Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 4, 2026 / 12:53 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అల్ల‌రి న‌రేష్‌ (Hero)
  • సుర‌భి (Heroine)
  • విష్ణుప్రియ‌, రాశీ సింగ్‌, సీనియ‌ర్ న‌రేష్, శ్రీనివాస‌రెడ్డి, తార‌క్ పొన్న‌ప్ప త‌దిత‌రులు (Cast)
  • చంద్ర‌మోహ‌న్ చింతాడ‌ (Director)
  • రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ (Producer)
  • చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌ (Music)
  • రాంరెడ్డి (Cinematography)
  • ఛోటా కె ప్రసాద్ (Editor)
  • Release Date : 4th సెప్టెంబర్ 2026
  • అన్న‌పూర్ణ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ (Banner)

కామెడీ సినిమాల‌తో టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు అల్ల‌రి న‌రేష్‌ (Allari Naresh). ప‌రాజ‌యాల కార‌ణంగా గ‌త కొన్నేళ్లుగా ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల‌తో సినిమాలు చేస్తోన్న అల్ల‌రి న‌రేష్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రంభ ఊర్వ‌శి మేన‌క‌తో త‌న ఫేవ‌రేట్ కామెడీ జాన‌ర్‌ను మ‌ళ్లీ ట‌చ్ చేశాడు. చంద్ర‌మోహ‌న్ చింతాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను హాస్య మూవీస్‌తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించింది. సుర‌భి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో విష్ణుప్రియ‌, రాశీ సింగ్‌, ప్రిషా సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన రంభ ఊర్వ‌శి మేన‌క ఎలా ఉంది? (Ramba Oorvasi Menaka) ఈ సినిమాతో అల్ల‌రి న‌రేష్ హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

Ramba Oorvasi Menaka Movie Review

Ramba Oorvasi Menaka Movie Review and Rating

క‌థ‌: సూరి (Allari Naresh) ఎప్ప‌టికైనా సినిమా హీరో కావాల‌ని క‌ల‌లు కంటుంటాడు. ఊరినిండా అప్పులు చేస్తాడు. త‌ల్లి క‌ష్ట‌ప‌డి అత‌డిని పెంచి పోషిస్తుంటుంది. సూరి ఇంట్లో ఓ మ్యాజిక్ బుక్ ఉంటుంది. ఆ బుక్ ఓపెన్ చేస్తే రంభ (రాశీ సింగ్‌) ఊర్వ‌శి (విష్ణుప్రియ‌) మేన‌క (ప్రిషా సింగ్‌) ఇంద్ర‌లోకం నుంచి దిగి వ‌స్తార‌ని బాబాయ్ సీఈవో ర‌మ‌ణ (సీనియ‌ర్ న‌రేష్‌) చెప్పిన మాట‌ల‌ను న‌మ్ముతాడు సూరి.

ముప్ఫై ఏళ్లుగా ఆ బుక్ ఓపెన్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటాడు. త‌న‌తో క‌లిసి చ‌దువుకున్న చిన్నిని (సుర‌భి) సూరి ఇష్ట‌ప‌డ‌తాడు. నెల రోజుల్లోపు ఊళ్లో చేసిన అప్పుల‌న్నీ తీర్చేస్తేనే త‌న కూతురిని ఇచ్చి పెళ్లిచేస్తాన‌ని చిన్ని తండ్రి కండీష‌న్ పెడ‌తాడు. మ‌రోవైపు సూరి త‌ల్లి ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. ఆమె బ‌త‌కాలంటే ఆప‌రేష‌న్ చేయాల‌ని, అందుకు అర‌వై ల‌క్ష‌లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని డాక్ట‌ర్లు అంటారు.

అదే టైమ్‌లో మ్యాజిక్ బుక్ ఓపెన్ అయ్యి ఇంద్ర‌లోకం నుంచి రంభ ఊర్వ‌శి మేనక సూరి ఇంటికి వ‌స్తారు. వారి దివ్య శ‌క్తుల సాయంతో త‌న క‌ష్టాల‌న్నీ తీరిపోతాయ‌ని సూరి క‌ల‌లు కంటాడు. కానీ రంభ ఊర్వ‌శి మేన‌క శ‌క్తుల‌న్నింటిని ఇంద్రుడు తీసేసుకున్నాడ‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఏమైంది? త‌న త‌ల్లిని సూరి బ‌తికించుకున్నాడా? అప్పుల‌న్నీ తీర్చేసి చిన్నిని పెళ్లిచేసుకున్నాడా? సూరిపై ఎస్ఐ అప్ప‌ల‌నాయుడు (తార‌క్ పొన్న‌ప్ప‌) ప‌గ‌తో ర‌గిలిపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? రంభ ఊర్వ‌శి మేనక కార‌ణంగా సూరి క‌ష్టాలు ఎలా రెట్టింపు అయ్యాయి? వాటి నుంచి బాబాయ్ సీఈవో, స్నేహితుడు ప‌రిమ‌ళ (శ్రీనివాస‌రెడ్డి) సాయంతో సూరి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Ramba Oorvasi Menaka Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: బాధ్య‌త‌లు లేకుండా బ‌లాదూర్‌గా తిరిగే యువ‌కుడిగా జోవియ‌ల్ యాక్టింగ్‌తో అల్ల‌రి న‌రేష్ (Allari Naresh) ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమాకు వ‌న్ మెన్ ఆర్మీలా నిలిచాడు. అల్ల‌రి న‌రేష్ ప్రియురాలిగా సుర‌భి పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. రంభ‌గా రాశీసింగ్‌, ఊర్వ‌శిగా విష్ణుప్రియ‌, మేన‌క‌గా ప్రిషాసింగ్ త‌మ గ్లామ‌ర్‌తో మెప్పించారు. సీఈఓగా సీనియ‌ర్ న‌రేష్‌తో పాటు ఇంద్రుడిగా వెన్నెల‌కిషోర్ కామెడీనే ఈ సినిమాకు బిగ్గెస్ట్ రిలీఫ్‌గా నిలిచింది. వారు క‌నిపించే ప్ర‌తి సీన్ సినిమాను కాపాడింది.

శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, గోప‌రాజు ర‌మ‌ణ పంచ్‌లు కొన్ని వ‌ర్క‌వుట్ అయ్యాయి. తార‌క్ పొన్న‌ప్ప విల‌నిజం సెట్ట‌వ్వ‌లేదు. పూర్తిగా క‌మెడియ‌న్‌లా కాకుండా, విల‌న్ అనే ఫీల్ క‌ల‌గ‌కుండా క్యారెక్ట‌ర్‌ను క‌న్ఫ్యూజింగ్‌గా రాసుకున్నారు. డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ ఓ చిన్న పాత్ర‌లో మెరిశారు.

Ramba Oorvasi Menaka Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: యూత్‌కు సంబంధించిన ఓ మెసేజ్‌కు వినోదాన్ని జోడించి ద‌ర్శ‌కుడు చంద్ర‌మోహ‌న్ చింతాడ ఈ క‌థ‌ను రాసుకున్నారు. సూప‌ర్ హిట్ సినిమాల స్ఫూఫ్‌లు, స్టార్ డైరెక్ట‌ర్ల‌పై పంచ్‌ల‌తో ఈ సినిమాను నింపేశారు. ఎస్‌స్వీ కృష్ణారెడ్డి య‌మ‌లీల ఛాయ‌లు ఈ సినిమాలో చాలానే క‌నిపిస్తాయి. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ ప్లెజెంట్‌గా ఉంది. నా కంటి మీద కునుకే సాంగ్‌ ఫోక్ స్టైల్‌లో సాగితే టైటిల్ ట్రాక్ మాస్ ఆడియెన్స్ మెప్పించేలా ఉంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, హాస్య మూవీస్ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఓకే. ప‌ల్లెటూరి అందాల‌ను కెమెరామెన్ రాంరెడ్డి హైలైట్ చేసిన తీరు మెప్పిస్తుంది.

Ramba Oorvasi Menaka Movie Review and Rating

విశ్లేష‌ణ‌: క‌ష్ట‌ప‌డ‌కుండానే జీవితంలో పైకి రావాల‌ని చాలా మంది యువ‌త క‌ల‌లు కంటుంటారు. భ్ర‌మ‌ల్లో బ‌తుకుతుంటారు. సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించేవాళ్లే మాత్ర‌మే కాకుండా జీవితంలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తూ త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డిన వారంతా కూడా హీరోలే అనే మెసేజ్‌కు మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు చంద్ర‌మోహ‌న్ చింతాడ రంభ ఊర్వ‌శి మేన‌క క‌థ‌ను రాసుకున్నారు. ఈ పాయింట్‌కు సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్‌ను జోడించాడు.

హీరోల‌ను గెలిపించ‌డం కోసం దేవుళ్లు భూమిపైకి దిగివ‌చ్చే కాన్సెప్ట్‌ల‌తో గ‌తంలో చాలానే సినిమాలు వ‌చ్చాయి. వాటికి భిన్నంగా రంభ ఊర్వ‌శి మేన‌క (Ramba Oorvasi Menaka) ఇంద్ర‌లోకం నుంచి భూమిపైకి రావ‌డం అనే డిఫ‌రెంట్ పాయింట్‌తో ఈ క‌థ‌ను న‌డిపించాడు. అప్స‌ర‌స‌లు కూడా దేవుళ్లేన‌ని చూపించాడు.

ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు సినిమాలో వినోదానికే ప్రాధాన్య‌త‌నిచ్చారు. రాజ‌మౌళి నుంచి జేమ్స్ కామెరూన్ వ‌ర‌కు అంద‌రూ డైరెక్ట‌ర్ల‌పై సినిమాలో పంచ్‌లు వేశారు. అవ‌న్నీ న‌వ్విస్తాయి, రంభ‌తో న‌రేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్లు, పేర‌డీ సాంగ్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. బ్యాచ్‌ల‌ర్ క‌ష్టాలు, ఐటెంగ‌ర్ల్స్ అంటే ఎవ‌రూ అంటూ సీనియ‌ర్ న‌రేష్ చెప్పే ఓ లెంగ్తీ డైలాగ్‌కు విజిల్స్ ప‌డ‌తాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ ఇమిటేష‌న్ సీన్‌ వ‌ర్క‌వుట్ అయ్యింది. చివ‌ర‌లో త‌ల్లి సెంటిమెంట్‌తో సినిమాను ఎండ్ చేశారు.

ఫ‌స్ట్ హాప్ అస‌లు క‌థే లేకుండా సినిమాను న‌డిపించారు. హీరోహీరోయిన్ల ల‌వ్ ట్రాక్ నీర‌సంగా ఉంది. విల‌న్ రివేంజ్‌ను డెప్త్‌గా రాసుకోవాల్సింది. రిపీటెడ్ సీన్లు ఎక్కువే ఉన్నాయి. అవ‌న్నీ బోర్ కొట్టిస్తాయి. కామెడీతో వాటిని క‌వ‌ర్ చేశారు.

Ramba Oorvasi Menaka Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: లిమిటెడ్ ఫ‌న్ రైడ్‌. స్ఫూఫ్‌ల‌తో అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే రంభ ఊర్వ‌శి మేన‌క న‌వ్విస్తుంది.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Prisha Singh
  • #Ramba Oorvasi Menaka Movie
  • #Rashi Singh
  • #surbhi

Reviews

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

6 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version