కూతురు పుట్టినరోజుని సెలెబ్రేట్ చేసిన పవన్

  • March 24, 2017 / 11:47 AM IST

“పిల్లల పుట్టినరోజుకి పెద్ద పెద్ద గిఫ్టులు ఇవ్వనవసరం అవసరం లేదు. ఆ రోజు తల్లిదండ్రులు తోడుగా ఉంటే చాలు. అదే పెద్ద కానుక” అని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చెప్పారు. బద్రి సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈమె పవన్ జీవితంలోకి ప్రవేశించారు. వారిద్దరూ కొంతకాలం సహజీవనం చేసుకుని.. పెళ్లిచేసుకున్నారు. అకీరా, ఆద్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు. పవన్ మూడో పెళ్లి చేసుకుని రేణుకి దూరంగా ఉన్నప్పటికీ, పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. నిన్న (మార్చి 23 ) ఆద్య బర్త్ డే.

అందుకే పవన్ పూణే వెళ్లి దగ్గరుండి కూతురి పుట్టినరోజు వేడుకను సందడిగా నిర్వహించారు. దీంతో సంబరపడిన రేణు దేశాయ్ ఆనందకర విషయాన్నీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. రేణు, ఆద్య, పవన్ ఉన్న ఫోటోని షేర్ చేసింది. కాటమరాయుడు సూపర్ హిట్ టాక్ తో ఆనందంలో ఉన్న పవన్ అభిమానులకు ఈ వార్త మరింత సంతోషాన్ని కలిగించింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus