Pawan Kalyan: చరణ్ కు పవన్ విషెస్.. ఆ చిన్న పాయింట్ తో పొలిటికల్ సెగలు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల చెబుతూ వచ్చిన ఒక లెటర్ ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన ఈ బర్త్‌డే విషెస్‌లో వినిపించిన విషయం కంటే కనిపించిన లెటర్‌హెడ్‌నే ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా చూసేవారికి చిన్న విషయం అనిపించొచ్చు.. కానీ ప్రభుత్వం అనే ఒక అధికారిక వ్యవస్థకు చెందిన గుర్తులను ఉపయోగించడంలో నిబంధనలు ఉండడాన్ని మర్చిపోకూడదనే కామెంట్స్ వస్తున్నాయి.

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రామ్ చరణ్‌కు “అత్యంత ప్రతిభావంతుడైన నటుడు” అంటూ అద్భుతంగా విషెస్ చెప్పారు. అయితే ఆ లెటర్‌పై “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – ఉప ముఖ్యమంత్రి” అనే అధికారిక గుర్తులు ఉండటంతో అది కేవలం వ్యక్తిగత శుభాకాంక్షల విషయంలో సరైన పద్ధతి కాదని విమర్శకులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారిక ప్రతీకల వాడకంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదంతా చిన్నదే అనుకునే మెగా ఫ్యాన్స్ మాత్రం “ఇది బాబాయ్ నుంచి అబ్బాయికి వచ్చిన లేఖ మాత్రమే” అంటూ దానిని ఒక ఆప్యాయతగా చూస్తున్నారు. మరొకవైపు ఇది అనవసర విమర్శ అని భావిస్తున్న జనసేన కార్యకర్తలు, “ఇదంతా కావాలనే విస్తరించే ప్రయత్నం” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇది నైతికంగా సరైనదిగా పరిగణించాలా లేక బంధుత్వంలో వచ్చిన ప్రేమ భావం అని పరిగణించాలా అనే దానిపై రెండు వర్గాలు వేర్వేరుగా స్పందిస్తున్నాయి. ఒకవేళ ఇదే అంశం ఎవరో ఇంకొకరిపై జరిగి ఉంటే ఇదే స్థాయిలో మన్నించేవాళ్లమా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ గుర్తుల పరిరక్షణ బాధ్యత అధికారులపైనే ఉండాలన్నది మౌలిక తత్వం. మొత్తానికి చరణ్ పుట్టినరోజున పవన్ విషెస్ అందించిన ఆనందం ఒకవైపు ఉండగా.. ప్రభుత్వ గుర్తులతో వచ్చిన లెటర్ మరోవైపు రాజకీయ సెగల్ని రేపింది. మరి పవన్ దీనిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

దక్షిణాది సినిమా ప్రేక్షకులపై సల్మాన్‌ ఖాన్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus