Pawan Kalyan: అలా చేయడం మన సమిష్టి బాధ్యత.. పవన్ కామెంట్స్ వైరల్!
- January 22, 2024 / 06:59 PM ISTByFilmy Focus
ఈరోజు అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకకు హాజరైన వాళ్లలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయోధ్యలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఈరోజు నాకు చాలా భావోద్వేగంగా ఉందని ఆయన అన్నారు. రాముని ప్రాణప్రతిష్ట సమయంలో నా కళ్ల నుంచి కన్నీళ్లు కారాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఈ అద్భుతమైన మహోత్సవాన్ని మన దేశం ఒకే జాతిగా బలోపేతం చేసిందని రాముడు ధర్మం, సహనం, త్యాగం, ధైర్య సాహసాలకు ప్రతిరూపమని అందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని పవన్ చెప్పుకొచ్చారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో మనమంతా పాలు పంచుకోవడం సమిష్టి బాధ్యత అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాబోయే రోజుల్లో పవన్ మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. పవన్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు కొంత సమయం మాత్రమే ఉండటంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఈ ఏడాది టీడీపీ జనసేనలకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని పవన్ ఫీలవుతున్నారు. ఏపీలో జనసేన ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందో స్పష్టత రావాల్సి ఉంది.

ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాతే పవన్ సినిమాలలో నటించనున్నారని సమాచారం అందుతోంది. (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ భారీ విజయాలను సొంతం చేసుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

















