తన 25 వ చిత్రానికి టైటిల్ ఖరారు చేసిన పవన్ కళ్యాణ్!

డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పవన్ నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్లుగా అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. సీనియర్ నటి కుష్బూ కీలకరోల్ పోషిస్తోంది. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్న ఈ సినిమాకి  “దేవుడే దిగి వచ్చినా..”, పరదేశ ప్రయాణం”,  “రాజు వచ్చినాడు”, “ఇంజనీరింగ్‌ బాబు” అనే అనే పేర్లు వినిపించాయి. అయితే ఈ టైటిల్స్  పవన్ కళ్యాణ్ కి నచ్చక పోవడంతో డైరక్టర్ వాటిని పక్కన పెట్టారని తెలిసింది.

త్రివిక్రమ్ సూచించిన మరో పేరు అజ్ఞాతవాసి కి పవన్ ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ టైటిల్ తో కూడిన పోస్టర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీని  సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. జల్సా, అత్తారింటికి దారేది కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus