సంచలన దర్శకుడి నుండీ వివాదాల దర్శకుడుగా మారాడు రాంగోపాల్ వర్మ. మహా మొండిగా కొందరి పై సెటైర్ లు వేయడానికే అన్నట్టు సినిమాలు చేస్తుంటాడు వర్మ. ఈ నేపథ్యంలోనే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ (కమ్మ రాజ్యంలో కడప రెడ్లు) చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు టీడీపీ, జనసేన పార్టీల నేతలను విమర్శించే విధంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి.
చంద్రబాబు ని కరుడుగట్టిన విలన్ గా.. ఇక లోకేష్, పవన్, కె.ఏ.పాల్ పాత్రలను చాలా కామెడీగా చూపించి.. వారి అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురయ్యేల చేసాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన కొందరు జనసేన కుర్రాళ్ళు.. వినూత్న రీతిలో వర్మ పై నిరసన తెలిపారు. రాంగోపాల్ వర్మ చనిపోయినట్లుగా శ్రద్ధాంజలి బ్యానర్ ఏర్పాటు చేసి బూతులు తిడుతూ వచ్చారు. సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇది చూసిన వర్మ… ఆ పోస్ట్ ను షేర్ చేయడంతో పాటు… ‘బాబు, లోకేష్, పవన్ వీరాభిమానులు సినిమా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేయడం ఆపి, ఆ మూవీని అర్థం చేసుకోవాలంటూ పేర్కొన్నాడు. అలాగే ‘అభిమానుల పై ప్రమాణం చేసి చెబుతున్నాను.. నేను ఎవరిని కించపరచడానికి ఈ సినిమా చేయలేదు, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీశాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఏమైనా చివరికి దీనిని కూడా సినిమా పబ్లిసిటీ వాడేసుకున్నాడు వర్మ.
వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!