Pawan Kalyan: ఆ నిర్మాతకు ఓకే చెప్పిన పవన్?
- July 17, 2021 / 08:22 AM ISTByFilmy Focus
2019 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ వేర్వేరు కారణాల వల్ల ఎన్నికల్లో విజయం సాధించలేదు. అయితే ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు రాకపోవడంతో సినిమాలపై దృష్టి పెట్టిన పవన్ చకచకా సినిమాలు చేసేస్తున్నారు. ఇప్పటికే పవన్ నటించిన వకీల్ సాబ్ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కాగా వచ్చే ఏడాది జూన్ నాటికి పవన్ నటించిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు హరిహర వీరమల్లు రిలీజ్ కానున్నాయి.
ఈ సినిమాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. పవన్ ఈ సినిమాలతో పాటు ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరితో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే నిర్మాత కోనేరు సత్యనారాయణ కూడా పవన్ తో సినిమా తీయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. కోనేరు సత్యనారాయణ పవన్ కు అడ్వాన్స్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే పవన్ హీరోగా కోనేరు సత్యనారాయణ నిర్మాతగా తెరకెక్కే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వస్తుందని పవన్ ఇకపై పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లోనే నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవుతారని తెలుస్తోంది.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

















