డైరెక్టర్ కొరటాల శివకు…చిరంజీవి పుణ్యమా అని రెండేళ్లకు పైనే గ్యాప్ వచ్చింది. ఆయన గత చిత్రం భరత్ అనే నేను 2018 ఏప్రిల్ లో విడుదలయ్యింది. సైరా మూవీ షూటింగ్ లేట్ కావడంతో కొరటాల ఆచార్యలో చిరు జాయిన్ కావడానికి చాలా సమయం పట్టింది. ఇక నిరవధిక షూటింగ్ జరిపి షూటింగ్ పూర్తి చేద్దాం అని కొరటాల భావించగా…కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ మరో అవాంతరంలా మారింది.
దీనికి తోడు మరో సమస్య కొరటాలను వేధిస్తుంది. ఈ మూవీలో ఓ పాత్ర కోసం చరణ్ ని అనుకున్నారు. అరగంట నిడివి గలిగిన కీలక పాత్ర చరణ్ చేస్తే బాగుంటుందని చిరు, కొరటాల భావించి, రాజమౌళితో మాట్లాడి ఓ కె చేశారు. ఐతే లాక్ డౌన్ వలన ఏర్పడిన మూడు నెలల గ్యాప్ వీరి ప్రణాళికలను తారుమారు చేసింది. ఆర్ ఆర్ ఆర్ ఎలా పూర్తి చేయాలో అర్థం కాక రాజమౌళి తలపట్టుకుంటుండగా…చరణ్ ని ఆచార్య షూటింగ్ కోసం అనుమతించే పరిస్థితి ఉండకపోవచ్చు.
కాబట్టి కొరటాల శివ చరణ్ చేస్తాడనుకున్న పాత్రకు ప్రత్యామ్నాయం వెతికే పనిలో ఉన్నాడు. కాగా ఈ పాత్రకు చరణ్ కానీ పక్షంలో పవన్ బాగా సరిపోతాడని కొరటాల ఆలోచనట. ఈ విషయం చిరుకి కూడా కొరటాల చెప్పడం జరిగిందట. ఈ విషయమై పవన్ ని సంప్రదించే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు వినికిడి. ఇప్పటికే మూడు చిత్రాలు ఒప్పుకొని ఉన్న పవన్ ఆచార్య కోసం డేట్స్ కేటాయిస్తారో లేదో చూడాలి.
Most Recommended Video
కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే